Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

చోడవరం ఎన్నికల బరిలో ఇద్దరు తోడు దొంగలు….

– ఓటును స్వచ్ఛందంగా వేసి .. దేశాన్ని కాపాడండి,… – కూటమి అభ్యర్థిని గెలిపించండి …… – సీ.పీ.ఐ నేత రెడ్డిపల్లి అప్పలరాజు

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.27.04.2024ది. భారత్ కూటమి బలపరచిన అభ్యర్థిని గెలిపించి, బూర్జువా రాజకీయ పార్టీలను తరిమి కొట్టి, దేశాన్ని కాపాడవలసిందిగా సీ.పీ.ఐ జిల్లా సమితి సభ్యుడు, ఏ.పి. జిల్లా రైతు సంఘం కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు కార్మిక, కర్షక, అనుబంధ ప్రజా సంఘాలు, ప్రజలకు పిలుపునిచ్చారు. చోడవరం నియోజక వర్గాన్ని ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లు, కుటుంబ సభ్యులు, అనుచరులు ఏ విదంగా దొచ్చుకున్నారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో శనివారం సిపిఐ నేతలు అత్యవర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిపిఐ నేత రెడ్డిపల్లి మాట్లాడుతూ చోడవరంలో పోటీ చేస్తున్న తెలుగుదేశం కూటమి, వైసిపి అభ్యర్థులకు ఓటు వేయడం వలన చోడవరం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
చోడవరం నియోజవర్గంలో పోటీ చేస్తున్న టి.డి.పి. కూటమి అభ్యర్ధి కె.ఎస్.ఎన్.రాజు, వై.ఎస్సార్ అభ్యర్ధి తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ లు ఇద్దరూ తోడు దొంగలని తెలిపారు. దొంగా దొంగా ఊర్లు పంచుకున్నట్లు గా
చోడవరం నియోజకవర్గంలో ఇద్దరు మాజీ శాసనసభ్యులు రియల్ ఎస్టేట్, మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియాకు డాన్ లుగా వ్యవహరిస్తూ చీకటి సామ్రాజ్యం ఏలారని తెలియజేసారు. పైకి బద్ద వైరం నటిస్తూ తెర వెనుక ఇద్దరు చీకటి వ్యాపారాల్లో భాగ స్వామ్యులుగా, తెర వెనుక మంచి మిత్రులుగా … ఇద్దరూ ఇద్దరే గా ఎవరు గెలిచినను వారి చీకటి వ్యాపారానికి వారే రాజులుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయడంపై సిపిఐ పార్టీ అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు తీవ్రంగా ఖండిస్తున్నారు. చోడవరం అభివృద్ది చెందాలంటే టి.డి.పి. కూటమి అభ్యర్ధి, వై.సి.పి. అభ్యర్ధులు ఇద్దరూ పోటీ నుండి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. చోడవరం నియోజక వర్గాన్ని ఏ విధంగాను అభివృద్ది చెందనివ్వకుండా పది పది సంవత్సరాలు కె.ఎస్ ఎన్. రాజు మైనింగ్, ఇసుక వ్యాపారంతో విజయరామరాజు పేట వద్దు బొడ్డేరు వంతెన, గవరవరం వద్ద శారద నది పై వంతెనలు కూలదోస్తే, ఐదు సంవత్సరాల కాలంలో కరణం ధర్మ శ్రీ వడ్డాది వద్ద పెద్దేరు నది పై వంతెన, విజయరామరాజు పేట వద్ద తాచేరు నది పై వంతెనలు కూలదోసారన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో ప్రభుత్వ భూములు, రస్తా గోర్జి, చెరువులు దురాక్రమణ చేసి యధేచ్చగా తెగనమ్మేసుకున్నారని తెలియజేసారు. బానయ్య కోనేరు లో పేదలకు, స్థానిక విలేఖరులకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటూ సుమారు వెయ్యి మందికి పైగా అమాయక ప్రజలను మోసం చేసిన ఘనత మన మాజీ ఎమ్మెల్యే కె. ఎస్.ఎన్.రాజు(ఉరఫ్ బాబు) దే అని తెలిపారు. రాష్ట్రంలోని సహకార రంగంలో అగ్రగామిగా నడుస్తూ, చోడవరం మాడుగుల నియోజకవర్గాల్లో కొన్ని లక్షల కర్షక, కార్మిక కుటుంబాలకు ఉపాధిని చూపే గోవాడ సుగర్స్ ను
చోడవరం ఇరు పార్టీల శాసనసభ్యులు, మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు వారి అనుచర కుటుంబ బృందాలు అడ్డగోలుగా దోచుకుని, ఈ రోజు కార్మిక, కర్షకులకు పేమెంట్లు ఇవ్వలేని పరిస్థితిలో దివాళా దిశగా అడుగులు వేయించిన ఘనత మన మాజీ శాసన సభ్యులుదే అని తెలిపారు. గోవాడ సుగర్స్ ను పూర్తిగా నాశనం చేసి, యంత్రాల విడి భాగాలు స్క్రాప్ కూడా అమ్ముకుంటున్న శాసన సభ్యులున్న సందర్భంలో ఈ రోజు చెరుకు రైతులు, కార్మికులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది అన్నారు. అదే విధంగా గ్రానైట్ క్వారీలకు గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ధర్మ శ్రీ సహకారంతో అనుమతులు పొందిన టి.డి.పి. ఎమ్మెల్యే కె ఎస్ ఎన్.రాజు … కళ్యాణపు లోవ రిజర్వాయర్ కు సాగు నీరు చేరకుండా రాజా వారి క్వారీ ల చుట్టూ గల రైతాంగాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ వ్యవసాయాలు పూర్తిగా నష్టపోయినను, దర్జాగా పదేళ్లు మైనింగ్ క్వారీ వ్యాపారం చేసారు.
చోడవరం నుండి అనకాపల్లి వెళ్లే వరకు ఎమ్మెల్యే రాజు క్వారీ నుండి అధిక రాయిలోడు తో రవాణా చేసి రోడ్లను పూర్తిగా నాశనం చేసారని, తన అనుచరులు చే జీవ నదుల్లో అక్రమ
ఇసుక తవ్వకాలు తో వ్యాపారాలు చేయించి బ్రిడ్జిలు కింద ఉన్న ఇసుకను పూర్తిగా తవ్వించి, బ్రిడ్జిలు పడిపోవడానికి కారణమైన ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లు మరలా ఈ చోడవరం నియోజకవర్గంలో ఏ విధంగా పోటీ చేస్తారని ప్రశ్నించారు.
చోడవరం నియోజక వర్గం ప్రజల్ని పిచ్చివాళ్ళు అని అనుకుంటున్నారా, నేతల మంటూ మేత మేసే అక్రమార్కులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. తాజాగా చోడవరం బి.ఎన్.రోడ్డుకు ఆనుకుని వున్న ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద పాత చెరువును ఇరు పార్టీల మాజీ ఎమ్మెల్యేలు దురాక్రమణ చేసి బడా బాబులకు ఒప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇరువురు చీకటి వ్యాపార మిత్రులు చెరొక పార్టీ వైపు పోటీ చేసి, ఎవ్వరు గెలిచినను మరొకరికి ఉపయోగపడే విధంగా చీకటి ఒప్పందాలు చేసుకోవడం, దానికి అభిమానులు, కార్యకర్తలంటూ అమాయక ప్రజలను బలి చేయడం విడ్డూరంగా ఉందని తెలియజేసారు. ….* పై తెలిపిన విషయాల్లో అసత్యముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు * ….. వామపక్ష పార్టీలతో కూడిన భారత కూటమి అభ్యర్థి జగతా శ్రీనివాసరావును హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నరాల శెట్టి సత్యనారాయణ. వియ్యపు రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img