Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

డ్వాక్రా మహిళలతో బలవంతపు కొనుగోలు ఆపాలి …

. విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.11.01.2024ది. మహిళా మార్ట్ పేరుతో డ్వాక్రా మహిళల తో బలవంతపు కొనుగోళ్లు ఆపాలని డ్వాక్రా మహిళలు గురువారం చోడవరంలో ఆందోళన చేపట్టారు. డ్వాక్రా మహిళలకు తెలియకుండా పొదుపు ఖాతా నుండి డైరెక్టగా మహిళా మార్ట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఆపాలని, మహిళా మార్ట్ లో కొనుగోలు చేయకపోతే భవిష్యత్తులో మీకు ఎటువంటి లోన్స్ కూడా బ్యాంకు నుండి రావని బెదిరిస్తున్నారని డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గం పరిధిలో చోడవరంలో నిర్వహించిన మహిళా మార్ట్ 4 మండలాల పరిధిలో వివోఏలు బెదిరిస్తున్నారని బలవంతంగా కొనిపిస్తున్నారని లబ్ధిదారులు, డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా సి ఐ టి యూ నాయకులు జీ వరలక్ష్మి రామలక్ష్మి, అలాగే మహిళా సంఘం ఐద్వా జిల్లా అధ్యక్షరాలు వరలక్ష్మి, మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలు, ఒంటరి మహిళలు, రోజువారి కూలీలు,vడ్వాక్రా గ్రూపుల్లో అధికంగా ఉన్నారని, అలాంటి వాళ్ళతో ఇలా సరుకులు కొనాలని ఇబ్బంది పెట్టడం, ప్రతి సభ్యుల దగ్గర రెండు వేలు తగ్గకుండా కొనాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గతంలో ప్రతి డ్వాక్రా గ్రూప్ నుండి 3000 రూపాయలు చొప్పున కట్ చేసారని, ఎందుకని అడిగితే మనం మహిళా మార్టు పెట్టుకుంటున్నామని దానికోసం అని చెప్పి, మేము ఇవ్వమని చెప్పినా వినకుండా గ్రూపు నుండి డబ్బులు కట్ చేశారని తీరా మార్ట్ పెట్టిన తర్వాత మాకు టార్గెట్ ఇచ్చి కచ్చితంగా ₹2000 తగ్గకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. 20 నెలలు పొదుపు డబ్బులు దాచుకుంటేనే గాని 2000 అవవని, అలాంటిది ఒక్కరోజులో 2000 రూపాయల సరుకులు కొనాలని ఒత్తిడి తీసుకురావడం, కొనకపోతే వాళ్లకి రావలసినటువంటి రుణమాఫీలు కానీ, లోన్స్ గాని ఆపేస్తామని లబ్ధిదారులను బెదిరింపులకు దిగినట్లు తెలిపారు. ఇప్పటికైనా సి డి పి ఓ గాని, సూపర్వైజర్ గానీ సరైన పద్ధతుల్లో మార్ట్ నడిపించాలని వి ఓ ఏ లకు టార్గెట్లు ఇచ్చి వాటిని డ్వాక్రా గ్రూప్ సభ్యుల మీద రుద్దకుండా ఉండాలని డిమాండ్ చేశారు. పద్దతి మారకపోతే భవిష్యత్తులో డ్వాక్రా మహిళలు అందరినీ తీసుకొచ్చి మార్టు ముందున ఆందోళన చేస్తామని వాళ్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి రాజమ్మ రమణమ్మ రాధ పార్వతమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img