Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

మద్యం దుకాణాల్లో ఇంటి దొంగలు

అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు బాటలు

  • పట్టించుకోని అధికారులు
    విశాలాంధ్ర – పరవాడ(అనకాపల్లి జిల్లా) ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేపట్టినప్పటి నుంచి గ్రామాల్లో మొబైల్‌ బెల్ట్‌ షాపులు ఎక్కువయ్యాయి. ‘ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్లుకోలేడు’ అనే నానుడి మద్యం దుకాణాల వద్ద సిబ్బందికి అతికినట్లు సరిపోతుంది. మండంలలోని పలువురు ఉద్యోగులు తమ తెలితేటలతో అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు బాటలు వేశారు. మద్యం అమ్మకాలు, స్టాక్‌ నిల్వలు అన్ని వారి చేతుల్లో ఉండడంతో అక్రమ సంపాదనకు హద్దులు లేకుండా పోయింది. చివరికి మద్యం షాపుల నైట్‌ వాచ్‌మెన్‌ల చేత మద్యం అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొందరు నైట్‌ వాచ్‌మన్‌లు నిత్యం రాత్రుళ్లు కాపలా కంటే అక్రమంగా మద్యం అమ్మడంలోనే బిజీబిజీగా ఉంటారు. ఒకప్పుడు కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూడా మధ్యాహ్నం వరకే దుకాణాల వద్ద మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో రాత్రి వేళ మందుకు డిమాండ్‌ ఉండేది. వారి కోసం సదరు ఉద్యోగులే కొంత మంది టీమ్‌తో మొబైల్‌ మద్యం దుకాణాలను ప్రారంబించారు. స్కూటర్లపైనే అడిగిన వారికి మద్యం సరఫరా చేసేవారు. మద్యాన్ని లెప్ట్‌ చేసి రహస్య ప్రాంతాల్లో స్టాక్‌ చేసుకుని తమ దందాను కొనసాగించేవారు. గత ప్రైవేట్‌ మద్యం దుకాణాల సిబ్బందితో కలిసి ఈ దందాకు తెరతీసారు. కరోనా సమయంలో ఒక్క పరవాడలోనే లక్షల్లో లాబాలు పంచుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా రూ.150, రూ.200 ఉండే మందు కేసులు వచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడు పోతున్నట్లు దుకాణంలో చెబుతున్నారు. వాటినే స్కూటర్లపై రూ.50 నుంచి రూ.100 అదనంగా బ్లాక్‌లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు మందు అవసరమైన కేసుకు రూ.1000 అదనంగా తీసుకుని సరుకు అందిస్తారని మందుబాబులే చెబుతున్నారు. ఇక్కడి నుంచి కొందరు ఎక్సైజ్‌ అధికారులకు కూడా మామూళ్లు వెళుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరవాడలో మద్యం దుకాణాల ఉద్యోగులే బహిరంగంగా బెల్టుషాపులకు తరలిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. వాడచీపురుపల్లి, దేశపాత్రునిపాలెం, లంకెలపాలెం మద్యం దుకాణాల ఉద్యోగులు కూడా తన బంధువుల చేత మద్యం అమ్మిస్తున్నాని ఆరోపణలు ఉన్నాయి. బ్రాండెడ్‌ మద్యం కావాలన్నా.. వీరు క్షణాల్లో సరఫరా చేస్తారని పలువురు మందుబాబులు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా సెబ్‌ అధికారులు దాడులు చేసిన సంధర్భాలు ఎక్కడా కనిపించలేదు. పైగా గతంలో అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడ్డ ఉద్యోగలను తొలగించినట్లు తొలగించి తిరిగి అదే సిబ్బందిని అధికారులు నియమించడం పట్ల అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసుల ప్రవర్తన కూడా భిన్నంగానే ఉంది. గతంలో మాదిరిగా అక్రమ మద్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎన్నిల వేళ నిత్యం కేసులు నమోదు చేసిన పోలీసులు కూడా ప్రస్తుతం వదిలేయడంతో ఉద్యోగుల అక్రమ పంపాదనకు అడ్డేలేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img