Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

విశ్వ నరుడు చేగువేరా

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.14.06.2024ది. ‘ విశ్వ నరుడు చేగువేరా ” అని ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు అన్నారు. చోడవరం ప్రేమ సమాజంలో ఆర్క్ ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన చేగువేరా జయంతి కార్యక్రమం లో విశ్రాంత ఉప కులపతి ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చేగువేరా గొప్ప మానవతా వాదిగా, వ్యవసాయ మంత్రిగా చేసిన ఎన్నో సంస్కరణలు వ్యవసాయ లో విప్లవాన్ని తీసుకు వచ్చాయిన్నారు. ఎప్పటికీ ఈ ప్రపంచం లో యువతకి అతనొక ప్రవహించే ఉత్తేజం, స్ఫూర్తి అని తెలిపారు. క్యూబా నియంత పాలన నుండి విముక్తి కల్గించి, పునర్నిర్మాణం లో ప్రధాన భూమికను పోషించి, బొలీవియా విముక్తి కోసం పోరాడుతూ వీరమరణం పొందిన విప్లవ యోధుడు చేగువేరా అని తెలియజేసారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన.. లాటిన్ అమెరికా నిర్మాణం అతని విజన్.! .. ఈ కార్యక్రమం లో వివిధ సామాజిక వేత్తలు, సంస్థ ల వ్యవస్థాపకులు, విశ్రాంత ఉపన్యాసకులు నడుపూరి దేముడు, సాకేత్ ఫౌండేషన్ ప్రకాష్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ టి.వి రమణ, ఆడమ్స్ స్కూల్ బి.వెంకట రావు, గణేష్ డిఫెన్స్ అకాడమీ గణేష్, వరలక్ష్మి ట్రస్ట్ మంగమ్మ, ప్రేమ సమాజం కార్యదర్శి ప్రసాద రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img