Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

ఉప ముఖ్య మంత్రిని కలిసిన ఎమ్మెల్యే అదీప్ రాజ్

విశాలాంధ్ర – పరవాడ; ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి బూడి ముత్యాలునాయుడిని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ తదితరులు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మాడుగుల నియోజకవర్గం తారువ గ్రామంలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి బూడికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరవాడ జెడ్పీటీసీ పైలా సన్యాసిరాజు, పార్టీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు, పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు, వెన్నలపాలెం సర్పంచ్ వెన్నెల అప్పారావు, పెందుర్తి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ పైల అప్పల నాయుడు, నాయకులు గండి రవికుమార్, వెన్నెల సింహాద్రి, పైలా రేగారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img