విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.05.04.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం, పరిసర ప్రాంతాల్లో నిషేధిత నాటు సారా ఏరులై పారుతోంది. స్థానిక కోటవీధిలో ఉన్న నౌడు వెంకట్రావు ఇంటి దగ్గర తరలించడానికి సిద్దంగా ఉన్న నిషేధిత నాటు సారా 21 లీటర్ల 500 మిల్లీ లీటర్లు కలిగివున్న చోడవరం గ్రామానికి చెందిన నౌడు వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. చోడవరం స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ డి. శేఖరం, పోలీస్ సిబ్బంది అతనిని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి సంబంధిత రికార్డులతో రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించారు.