Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

వృధా గా పోతున్న త్రాగు నీరు …. – పట్టించుకోని పంచాయితీ అధికారులు …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.26.06.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మేజర్ పంచాయతీ శివారు అన్నవరం వెంకయ్య గారి పేట ఉన్న పంచాయితీ కొళాయిలు నుండి త్రాగే నీరు వృధాగా పోతోంది. దీనిపై పంచాయతీకి ఫిర్యాదు చేసినను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపంతో త్రాగునీటి కుళాయిల కు ట్యాప్లు బిగించనందున మహిళలు నీరు పట్టుకున్న తర్వాత త్రాగునీరు వృధాగా బయటకు పోతుంది. భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి అంటూ పర్యావరణ వేత్తలు, అధికారులు, అనధికారులు పలు మార్లు హెచ్చరిస్తున్నను మేజర్ పంచాయతీలో త్రాగు నీరు ఎక్కడ పడితే అక్కడ వృధాగా బయిటకు పోతోంది. ఎక్కడకి అక్కడ ఇంకుడు గుంతలు తవ్వి నీరును పొదుపు చేస్తే, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని స్థానికులు, సీనియర్లు, ప్రజా, మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. త్రాగు నీటి కొళాయిలకు టాప్ లు బిగించి, ప్రజలకు నీటి అవసరాలు, నీటి వృధా, పొదుపు పై అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీస జాగ్రత్తలు తీసుకొని, త్రాగునీరు వృధాను అరికట్టడంలో ప్రభుత్వ, పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నీటి వృధాను అరికట్టవలసిందిగా కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img