Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఈ రహదారులు డ్రామాల ధర్మన్న ను గెలిపించేనా … ?

స్వంత నిధులంటూ సొంత డబ్బా …

– గోతుల రహదారుల పై సడెన్ గా పుట్టుకొచ్చిన ప్రేమ ….

– ఆదరా బాదరా గా రహదారుల మరమ్మత్తులు ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే. 16.04.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో నరకానికి నకళ్లు అవుతోన్న రహదారులు పై అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ కు సడెన్ గా సవతి తల్లి ప్రేమ పుట్టుకొచ్చింది అని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాత్రికి రాత్రే స్వంత నిధులతో రహదారి నిర్మాణ పనులంటూ బూర్జువా పత్రికల్లో సొంత డబ్బా కొడుతూ, వై.సి.పి. అధినేత వై.వి.సుబ్బా రెడ్డికి చూపించి, మార్కులు కొట్టేయడానికేనా … ఎన్నికల ప్రచారానికి ఇదొక వ్యూహంగా మారుస్తున్న ధర్మన్న డ్రామాలు ప్రజలకు ఎరుకే…., ఐదేళ్ళ పాలనలో ఒక్కసారి గుర్తుకు రాని ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారుల సమస్య, రానున్న సార్వత్రిక ఎన్నికలు వేళ సడెన్ గా గుర్తుకు రావడం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. స్వంత నిధులంటూ, తన అనుచరుల నుండి సదరు కాంట్రాక్టర్ కు కోట్లాది రూపాయలు రుణం ఇప్పించి, డ్రామాల ధర్మన్న ఫోటోలకు ఫోజులు ఇస్తూ తూతూ మంత్రంగా రహదారి పనులు కొన సాగిస్తూ, బూర్జువా పత్రికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారని స్థానికులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఈ రహదారుల డ్రామా ఎమ్మెల్యే ఎంపికలో ఫలించేనా…. వేచి చూడాల్సిందే….!!!!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img