Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

— అనంతపురం డీఎస్పీ టి.వి.వి ప్రతాప్
విశాలాంధ్ర -అనంతపురం : ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలని అనంతపురం డీఎస్పీ టి.వి.వి ప్రతాప్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశాల మేరకు అనంతపురంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ నుండీ ప్రారంభమైన ఈ ర్యాలీ సుభాష్ రోడ్డు, సప్తగిరి సర్కిల్, వై జంక్షన్ ల మీదుగా జడ్పీ కార్యాలయం వరకు కొనసాగింది. మ‌త్తు ప‌దార్థాల జోలికెళ్లి బంగారు జీవితాన్ని నాశ‌నం చేసుకోవ‌ద్దని డీఎస్పీ సూచించారు. డ్రగ్స్ లేని సమాజాన్ని స్థాపించడంలో ప్రతీ ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా … యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకుని మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని కోరారు. మాదకద్రవ్యాలు రవాణా చేసిన, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సి.ఐ లు రెడ్డెప్ప, క్రాంతికుమార్, ప్రతాప్ రెడ్డి, నారాయణరెడ్డి, సెబ్ సి.ఐ యల్లయ్య మరియు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img