Monday, April 22, 2024
Monday, April 22, 2024

బీసీల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి

బీసీలు బలహీనులు కాదు.. బలవంతులన్నదే టీడీపీ నినాదం

శ్రీ సత్యసాయి జిల్లా

విశాలాంధ్ర పెనుకొండ

పెనుకొండ పట్టణ కేంద్రం లోని తెదేపా కార్యాలయం నందు శుక్రవారం సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచీ బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ నేనని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ లను ఇబ్బంది పెట్టారని
స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించింది 16 వేల మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేసింది వైసీపీ పార్టీ.ఆదరణ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు వాటికి కార్పొరేషన్ ఛైర్మన్ లు నియమించారు కానీ వారికి నిధులు లేవు విధులు లేవు జగన్ రెడ్డి 2019-20లో రూ.15,061 కోట్లు కేటాయంచి.. అందులో రూ.10,478 కోట్లను అమ్మవడి, ఆసరా, చేయూత, వాహన మిత్ర స్కీంలకు నిధులు మళ్లించి బీసీలకు దగా చేశాడు.అధికారంలోకి వచ్చింది మొదలు పార్టీలో అందరిని కీలుబొమ్మలుగా ఆడించి ఇప్పుడు ప్రభుత్వ వైఫలాలు ఎమ్మెల్యే మీద నెట్టించి తప్పించుకోవడం జగన్ మోహన్ రెడ్డికె చెల్లిందని ఎద్దేవా చేశారు. వ్యవస్థ ను విద్వంసం చేయడం తప్ప ఈ నాలుగున్నర సంవత్సరం లో జగన్ మోహన్ రెడ్డి చేసింది ఏమిలేదని ప్రజలు మేల్కొల్చిన అవసరం వచ్చిందని ఆమె తెలిపారు. ఆమెతోపాటుగా తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img