Friday, June 14, 2024
Friday, June 14, 2024

అక్రమ కట్టడాలు తొలగించాలని సిపిఎం వినతి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండపట్టణంలో అక్రమ కట్టడాలు తొలగించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందునిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పెనుకొండ పట్టణంలో రోజురోజుకు భూకబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని పట్టణంలో అక్రమ నిర్మాణాలు విషయంలో పెనుకొండ కియోపరిశ్రమ రాక మునుపు నుండి పలుమార్లు అధికారులకు అర్జీలు ,ధర్నాలు చేపట్టడం జరిగింది. అధికారులు మాత్రం నిమ్మకు నీరుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. గ్రంథాలయం దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పక్కన ఉన్న మ్యాదరి అలివేలమ్మ బిల్డింగు పక్కనే ఉన్న నాలుగు అంతస్తులు భవనం మరియు సవితమ్మ పెట్రోల్ బంకు ఎదురుగా లక్ష్మమ్మ అప్పటి అధికారులు స్వచ్ఛంద సంస్థ కు స్థలం ఇస్తే దానిలో పక్క భవనం ఏర్పాటు చేసుకుని దేవాదాయ శాఖ భూమిని పక్క బిల్డింగ్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఊరు వాకిలి ఆంజనేయస్వామి పక్కన ఉన్న డ్రైనేజీ పైన కాంపౌండ్ కట్టడాలు బిల్డింగు కట్టినారు, తిమ్మాపురం ఇందిరమ్మ కాలనీ సర్వేనెంబర్ 180 లో పట్టాలు లేకునే స్థలాలు కబ్జా చేస్తున్నారు. అనేకచోట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాలు కాపాడాలని పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తిక్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ స్థలాలు కాపాడుకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జండాలు పాతి ఆక్రమించుకుంటాం ఆక్రమించుకొని నిరుపేదలకు ఇంటిస్థలాలు పేదలకు పంచుతాం. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంగాధర్, బాబావలి ,మహబూబ్ బాషా ,తిప్పన్న ,ఊతప్ప ,వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img