Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

యోగాతో ఒత్తిడి దూరం

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ గౌతమి శాలి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే, గుర్తింపు తీసుకువచ్చే రోజు ఈరోజు అని, ప్రపంచ యోగ దినోత్సవాన్ని అన్ని సంస్థలలో, జిల్లాలలోనూ జరుపుకుంటున్నామన్నారు. స్వయంగా తాను కూడా రోజూ యోగ చేస్తానని, అందరూ ప్రతిరోజు యోగా చేసే అలవాటును పెట్టుకోవాలన్నారు. యోగాతో ఒత్తిడి దూరమవుతుందని, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుందని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగ దినోత్సవాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేశారన్నారు. యోగతో పాటు రోజు గంట సేపు తాను ధ్యానం చేస్తానని, దేహానికి, మనసుకి యోగ మరియు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఎంతసేపు వీలైతే అంత సేపు యోగా చేయాలని సూచించారు. చిన్నప్పట్నుంచే ప్రతి ఒక్కరు యోగా అలవాటు చేసుకోవాలని, ఆ అలవాటు చివరి వరకు మనతో ఉంటుందన్నారు. అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంతో పాటు శాంతి, సంతృప్తి కలగాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, ఆర్డీవో జి.వెంకటేష్, డిపిఓ ప్రభాకర్ రావు, ఐసిడిఎస్ పిడి బిఎస్ శ్రీదేవి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిఎంహెచ్ఓ ఈ.బి.దేవి, డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి, డిఎస్డిఓ షఫీ, ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి కృష్ణవేణి, సీనియర్ వైద్యాధికారులు డా.రామ్ కుమార్, డా.రఫిక్, డా. తిరుపతి నాయుడు, వివేకానంద యోగ కేంద్ర అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, యోగ మాస్టర్లు, ఆయుష్ డిపార్ట్మెంట్, బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం, వివేకానంద యోగ కేంద్రం, సిబ్బంది, యోగ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img