Friday, June 14, 2024
Friday, June 14, 2024

ధర్మవరం నాట్యచార్యులు బాబు బాలాజీ కి పురస్కార అవార్డు బిరుదు ప్రధానం

విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం లో శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య చార్యులు అయిన బాబు బాలాజీ 30 సంవత్సరాలుగా నాట్య కలను వేలాదిమంది విద్యార్థులకు నేర్పిస్తూ తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఏలూరు పట్టణంలో అఖిలభారత బ్రాహ్మణ మహా సంఘం వారు వీరు చేస్తున్న సేవలను గుర్తించి, ఁఉత్తమ గురు పురస్కారంఁ అనే పురస్కార అవార్డు బిరుదు ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాబు బాలాజీ మాట్లాడుతూ తాను సేవా కార్యక్రమంలో బాల, బాలికలకు నాట్య కలను నేర్పడం నా పునర్జన్మ సుకృతముగా భావిస్తున్నానని తెలిపారు. మా నాట్య కళలను రాష్ట్రంలోని పలు జిల్లాలు లో ప్రదర్శించడం జరిగిందన్నారు. మా నాట్య కళలను గుర్తించి, అఖిలభారత బ్రాహ్మణ మహా సంఘం వారు, గురు పౌర్ణమి పురస్కరించుకొని రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రకంటి ప్రసాదు శర్మ, ముఖ్య అతిథి ఎండోమెంట్ బ్రాహ్మణ సమైక్య గౌరవ సలహాదారులు జ్వాలా పురం శ్రీకాంత్ చేతుల మీదుగా అందుకోవడం జరిగిందన్నారు. అనంతరం అందరి సమక్షంలో నన్ను ఘనంగా సత్కరించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నా నాట్య కళలు మున్ముందు మరింతగా విస్తరింప చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img