Friday, June 14, 2024
Friday, June 14, 2024

అమ్మ స్వచ్చంద సేవ సంస్థ సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి విరాళం

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అమ్మ స్వచ్చంద సేవ సంస్థ నిర్వాహకులు తరిమెల రమణారెడ్డి దాదాపు రూ. 70,000 విలువ చేసే మొబిలైజర్స్, ఆక్సిజన్ మాస్క్ లను ప్రభుత్వ సర్వజనసూపరిటెండెంట్ అడిషనల్ డి.యం.ఇ. డాక్టర్ కె.ఎస్.ఎస్ వెంకటేశ్వరరావు కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇవి ఆయాస ఉబ్బస వ్యాధితో బాధపడే వారికి ఉపయోగపడతాయి అన్నారు. అమ్మ స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులకు ఉపయోగపడే మాస్కులు,మొబిలైజర్స్ అందించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు ను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
డిప్యూటీ ఆర్.ఎం.వో డాక్టర్ వి.పద్మజ మరియు డాక్టర్ జి. హేమలత పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img