Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ డిమాండ్
విశాలాంధ్ర – ధర్మవరం : సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డులో చెన్నై కొత్తపల్లి, బుక్కపట్నం, ధర్మవరం మండలాలలో ఉన్న స్టాక్ పాయింట్ల హమాలీలతో జనరల్ బాడీ సమావేశాన్ని వారు నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నేలకోటప్ప అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా వెంకటేష్ హాజరు కావడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో 12 స్టాక్ పాయింట్ లో 200 మందికి పైగా హమాలీలు అనేక సంవత్సరాలుగా పనులు చేస్తున్నారని, చేసిన పనికి కూలి ఆడితే మాకు సంబంధం లేదు అని అనేక స్టాక్ పాయింట్ లో ఉన్న కాంట్రాక్టర్లు తెలియజేయడం బాధాకరమని తెలిపారు. నిత్యం తాగడానికి మంచినీరు ఇవ్వాలని ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ, వాటిని కూడా కొన్ని స్టాక్ పాయింట్ వారు ఉల్లంఘించి, అమలు చేయకుండా, నిర్లక్ష్యంగా కొంతమంది అధికారులు వ్యవహరించడం దారుణమని తెలిపారు. ఇక స్వీపర్లు వాచ్మెన్ లకు సుమారు 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా బ్రతుకుతారని? కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటారని? వారు ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రభుత్వమైన అమాలీల పట్ల సానుకూలంగా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, కోశాధికారి రాందాస్, మేస్త్రీలు ఆంజనేయులు, గంగాధర్, కదిరప్ప, కోటప్ప, సిఐటియు మండల అధ్యక్షులు ఆదినారాయణ, కార్యదర్శి అయుబ్ ఖాన్, జిల్లా నాయకులు జెవి. రమణ, ఎస్హెచ్ భాష , పెద్దన్న, మారుతి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img