జిల్లా ఎస్ పి అనుబ్బ రాజన్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఎన్నికల విధివిధానాల పట్ల కానిస్టేబుళ్ల నుండీ సి.ఐ ల వరకు ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సూచించారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో పోలీసులు పాటించాల్సిన విధి విధానాలు, చేపట్టాల్సిన విధులపై ఈరోజు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కానిస్టేబుళ్ల నుండీ సి.ఐ ల వరకు పాల్గొన్న ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండీ ముగిసే వరకు గల పోలీసుల పాత్ర- విధులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికలలో అక్రమాలకు అడ్డుకట్ట, శాంతిభద్రతల పరిరక్షణ, తదితర అంశాలపై ఎస్పీ దిశానిర్ధేశం చేశారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్ఠర్ విశ్వనాథ్ ఈ శిక్షణలో భాగంగా ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలపై క్షుణ్ణంగా అవగాహన చేశారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి, పలువురు సి.ఐ లు, ఎస్సైలు, ఏఎస్సైలు, హేడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.