Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయండి

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని ఏపీ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో గురువారము ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పీఎం. రామాంజనేయులు మాదిగ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఉన్నటు వంటి స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏసుబాబు మాదిగ మీద పల్నాడు జిల్లాకు చెందిన శ్రీకాంత్ చౌదరి ఫోన్ చేసి ఏసుబాబు మాదిగను కులం పేరుతో దూషించి కుటుంబ సభ్యుల్ని అసభ్యపద్యాలతో దూషించడాన్ని ఎమ్మార్పీఎస్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక దళిత నాయకుడిని ఫోన్ చేసి రేయ్ మాదిగ నకొడకా మాల లంజా కొడకా నువ్వు ఎక్కడున్నావ్ నీ అంత చూస్తారన్న శ్రీకాంత్ చౌదరి, అతని స్నేహితులు దూషించడం సమంజసమేనా అన్నారు. కావున వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ కి వెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్య నిర్వాహణ కార్యదర్శి కె. సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి కె. చిన్న బాలరాజు తాడపత్రి టౌన్ ఇంచార్జ్ తిరుపతి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img