విశాలాంధ్ర – ధర్మవరం : ఈనెల 19వ తేదీన పట్టణంలోని ఎర్రగుంట లయన్స్ కంటి ఆసుపత్రి ఆవరణంలో 2024-25 సంవత్సరపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు సభ అధ్యక్షులు గూడూరు మోహన్ దాస్, సభ నిర్వహణ, లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు వెంకటస్వామి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ గవర్నర్ లయన్ రమేష్ నాథ్ రెడ్డి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా వేణుగోపాలాచార్యులు, కార్యదర్శిగా రమేష్ బాబు, కోశాధికారిగా నాగేంద్ర, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఒకటవ ఉపాధ్యక్షులుగా యు. ప్రసాద్ ,రెండవ ఉపాధ్యక్షులుగా జగదీశ్వర ప్రసాద్, మూడవ ఉపాధ్యక్షులుగా పుట్లూరు నరసింహులు, క్లబ్ సర్వీస్ చైర్మన్గా కొత్త శ్రీరాములు, మెంబర్షిప్ చైర్మన్గా వెంకటేష్ కుమార్, క్లబ్బు అడ్మినిస్ట్రేటివ్గా జి. రాధాకృష్ణ కూడా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు.