Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఘనంగా ఏకాదశి పర్వదిన వేడుకలు..

విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలోని చెన్నకేశవ స్వామి గుడి, శ్రీనివాస నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఎన్టీఆర్ సర్కిల్లో గల పాండురంగ స్వామి దేవాలయం, పుట్టపర్తి రోడ్డు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం లలో ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు యొక్క ప్రత్యేక పూజల వైభవంగా నిర్వహించారు. ఆషాడ శుద్ధ ఏకాదశి సయ్యన ఏకాదశి సందర్భంగా శ్రీవారికి ప్రాతఃకాల అర్చనలో భాగంగా పంచామృతాభిషేకం, తోమాల సేవ, అనంతరం శ్రీవారికి, మహాలక్ష్మి అమ్మవారికి అర్చన, మహా నైవేద్య సమర్పణ గావించడం జరిగింది అని అర్చకులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా దేవాలయాల్లో భక్తాదుల సంఖ్య అధికం కావడంతో కిటకిటలాడింది. అత్యంత పవిత్రమైన ఏకాదశి కావడంతో పట్టణ గ్రామ ప్రాంతాల నుండి భక్తాదులు తమకు సమీపములో గల దేవాలయాల్లో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. పుట్టపర్తి రోడ్డు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఏకాదశి పండుగను పురస్కరించుకొని దాదాపు 600 మందికి అనాధలకు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరం భక్తాదుల తాకిడి అధికంగా ఉండడం పట్ల అర్చకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తాదులకు, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం పట్ల భక్తాదులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయాలతో పాటు మహిళలు తమ ఇళ్ల వద్ద కూడా ఉపవాస దీక్షతో, ప్రత్యేకమైన శ్రద్ధతో, తమ ఇంటి దేవుళ్లకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img