. మాంగల్య షాపింగ్ మాల్ వల్ల చిన్న, పెద్ద వ్యాపారస్తులకు పెద్ద దెబ్బ తగిలింది
. మాంగల్య షాపింగ్ మాల్ ను తొలగించాలంటే పట్టణ వ్యాపారస్తుల సహాయ సహకారాలు ఎంతో అవసరం…..
. ధర్మవరం పట్టుచీరల తయారీ అండ్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి.
విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణ వ్యాపారస్తులు అందరూ సహకరిస్తే సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయని, కొన్ని నెలల కిందట ధర్మవరం పట్టణంలో మాంగల్య షాపింగ్ మాల్ వల్ల చిన్న పెద్ద వ్యాపారస్తులకు పెద్ద దెబ్బే తగిలిందని, మాంగల్య షాపింగ్ మాల్‌ను తొలగించాలంటే పట్టణ వ్యాపారస్తుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని ధర్మవరం పట్టుచీరల తయారీ అండ్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాంగల్య షాపింగ్ మాల్ రాక మునుపు గత సంవత్సరం జూలై నెలలో పట్టణ వ్యాపారస్తులందరూ కూడా వందల సంఖ్యలో విజయవంతంగా ర్యాలీని నిర్వహించామని, తదుపరి చేనేత పరిశ్రమను కాపాడుకునేందుకే పట్టు చీరల తయారీ అండ్ వ్యాపారస్తుల సంఘం నువ్వు స్థాపించడం జరిగిందన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఎన్నో కష్టాలు, బాధలు, దుఃఖాలు, జయము, అపజయాలు నా హయాములో చూడటం జరిగిందని తెలిపారు. నేను ఎంత కష్టపడినా కూడా ఈ అధ్యక్ష పదవి నాకు తృప్తి ఇవ్వడం లేదని, ఇందుకు కారణం పట్టణంలోని వ్యాపారస్తులంతా ఐక్యమత్యంతో నాకు సహకరించలేకపోవడం బాధాకరమని తెలిపారు. కొంతమంది వ్యాపారస్తులు బలహీనత, భయము, వ్యతిరేకము, ప్రేమో, అర్థం కాలేదని అనుకున్న సమస్యలను ఈ సంఘము ద్వారా పరిష్కరించలేకపోవడం వలన నాకు ఎంతో బాధను కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యాపారస్తుడు మన సంఘానికి మద్దతు ఇవందే ఏ కార్యము కూడా విజయవంతం కాదని వారు మరోసారి గుర్తు చేశారు. నేడు మన ధర్మవరం పట్టణ వ్యాపారస్తులకు మాంగల్య షాపింగ్ మాల్ ఒక పెద్ద సమస్యగా మారిందని, హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారాలకు డీల పడిందని జీవనోపాధి ప్రశ్నార్ధకంగా మారిందని తెలిపారు. అందుకే ఈ అసోసియేషన్ ద్వారా మాంగల్య షాపును బందు చేసి తీరాలన్న తీర్మానము తాను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాంగల్య షాపు ప్రారంభం కాదని చెప్పి రాజకీయాలకు చోటుచేసుకుని నేడు ఎంతో మన బాధను అనుభవిస్తున్నామని తెలిపారు. మరి ఇప్పుడైనా ప్రభుత్వం మారిందని మనమందరము కలిసికట్టుగా పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. త్వరలోనే ఒక తేదీని ప్రకటిస్తామని, వ్యాపారస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన కుటుంబానికి భద్రతగా ఉండాలని వారు తెలిపారు. ఏ విషయమైనా సరే అసోసియేషన్‌కు సహకరించాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారస్తునదేనని తెలిపారు. అప్పట్లో మాంగల్య షాపింగ్ మాల్ కు కొంతమంది వ్యాపారస్తులు సహకరించడం నన్ను తీవ్రంగా బాధ కలిగించేదని తెలిపారు. ప్రోత్సాహము, సపోర్టు తప్పక ఉంటే విజయం వస్తుందని తెలిపారు. గడిచిన గతి సంవత్సరములో మన పట్టణ వ్యాపారస్తులకు రావలసిన చీరల బకాయిలను పోరాటాలు సల్ఫీ నగదును ఇప్పించడం జరిగిందని వారు తెలిపారు. కానీ మనం ఇంకా మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎన్నో బాధ్యతలు అందరికీ ఉన్నాయని, వ్యాపారస్తులంతా సహకరిస్తే నా బాధ్యతను కొనసాగిస్తానని లేనియెడల వచ్చేనెల నా రాజీనామాను సమర్పిస్తానని తెలిపారు. నా అధ్యక్ష పదవి కాలంలో ఎవరికైనా ఇబ్బంది పెట్టి ఉంటే బాధను కలిగించి ఉంటే కష్టమును కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నానని వారు బాహాటంగా ప్రకటించారు. ఏది ఏమైనా ధర్మవరం పట్టుచీరలకు ప్రసిద్ధిగాంచిందని, ప్రపంచ స్థాయిలోనే ధర్మవరం పట్టుచీరలకు ఎంతో గుర్తింపు కీర్తి ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించి, మన అసోసియేషన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారస్తుని మీద ఉందని వారు మరోసారి ప్రకటించారు.