Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ప్రజల జోలికి వస్తే తాటతీస్తా

గుమ్మనూరు జయరాం

విశాలాంధ్ర-పామిడి : పట్టణం రహమత్ ఫంక్షన్ హాల్లో భగీరథ ఉప్పర (సగర) ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటశివుడు యాదవ్ గుంతకల్ నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు.జయరాం మాట్లాడుతూ ఉప్పర సగర సోదరులు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ రోజు మీకు అండ అండగా మేమున్నాం అ ఇంత పెద్ద ఎత్తున సగర ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉంది.. అలాగే ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి చెబుతున్న రాజకీయంగా నువ్వు నేను శత్రువులం.. ఏదైనా సమస్య ఉంటే నువ్వు నేను తేల్చుకుందాం అంతేగానీ ప్రజల జోలికి వస్తే మీ తాట తీస్తామని హెచ్చరించారు. ఈ ఐదేళ్లలో టీడీపీ కుటుంబ సభ్యులను ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేశారు ఇక మీ దాదాగిరి చెల్లదు ఎందుకంటే గుమ్మనూరు జయ రాం గుంతకల్లు నియోజకవర్గం ప్రజలకు అండగా ఉన్నాడు ఓటు అనే ఆయుధంతో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి బుద్ధిచెప్పి ఇంటికి సాగనంపుదామని అని అన్నారు. కార్యక్రమంలో పత్తి హిమబిందు, బొల్లు శ్రీనివాస్ డ్డి, ప్రభాకర్ చౌదరి, దాసరి లక్ష్మీకాంతమ్మ, లీలా మనోహర్, మండ్లశ్రీని వాసులు, రంగస్వామి యాదవ్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img