Friday, June 14, 2024
Friday, June 14, 2024

విగ్రహం కూల్చివేత ఘటనపై పోలీసుల తక్షణ చర్యలు

కేసు నమోదు చేసిన అనంతపురం నాల్గవ పట్టణ పోలీసులు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : స్థానిక చంద్రబాబు కొట్టాలలోని ప్రధాన రహదారిపై ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి పొద్దుపోయాక కూల్చివేశారు.
ఈ విషయం తెలిసిన వెంటనే నాల్గవ పట్టణ సి.ఐ ఆర్. ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు ఉదయం ఘటనా స్థలానికి వెళ్లారు. విగ్రహం కూల్చివేత ఘటనపై ఆరా తీశారు. కూల్చివేత సమయంలో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల కోసం పరిసర ప్రాంతంలో విచారించారు. ఈ ఘటనపై నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు
రాజకీయ పార్టీలు లేదా గ్రూపుల మధ్య విద్వేషాలు/అలజడులు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని సి.ఐ ఆర్ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img