Monday, April 22, 2024
Monday, April 22, 2024

పెరిగిన విద్యుత్ చార్జీలు ప్రజల మెడలకు ఉరితాళ్లు

వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
విశాలాంధ్ర -తనకల్లు : ట్రూ అప్ చార్జీలు సర్చార్జీలు అడ్జస్ట్మెంట్ చార్జీల పేరిట ఏడుసార్లు విద్యుత్తు చార్జీలను పెంచి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల మెడలకు ఉరితాలు బిగించిందని సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో మండల పరిధిలోని కోటూరు గ్రామం వద్ద కల విద్యుత్తు కేంద్రం వద్ద శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామన్న వాగ్దానం ఏమైందనిప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పెరిగిన విద్యుత్ ఛార్జీలతో రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలు దాదాపు రెండు కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు విద్యుత్ కొనుగోలుతర తక్కువగా ఉన్నప్పటికీ తన బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా ఎక్కువ కు కొనుగోలు చేయడం ఏంటన్నారు. ఆర్టీసీ చార్జీలు 5 సార్లు పెంచడం విద్యుత్ చార్జీలు పెంచడం ఇలా పేద మధ్యతరగతి ప్రజలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ కనపడుతుందన్నారు పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా కొనసాగనివ్వమన్నారు గిరిజన తండాల్లో పెన్షన్ మంజూరు కావాలంటే మీటర్ బిగించుకోవాలని నిబంధనలను ఉపసంహరించుకోవాలని గిరిజన నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ రెడ్డప్ప రైతు సంఘం అధ్యక్షుడు చౌడప్ప రై సంఘం కార్యదర్శి ఇక్బాల్ సిపిఎం నాయకులు శివన్న రమణ వెంకటరమణ శ్రీనివాసులు తో పాటు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img