Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

కరాటే శిక్షణ భావితరాలకు భద్రత, రక్షణ ఇస్తుంది

మల్టీ స్టార్ బుడోకాన్ కరాటే అకాడమీ కరాటే మాస్టర్ ఇనాయత్ భాష

విశాలాంధ్ర – ధర్మవరం:: కరాటే శిక్షణ భావితరాలకు రక్షణ, భద్రత ఇస్తాయని మల్టీ స్టార్ బుడోకాన్ కరాటే అకాడమీ కరాటే మాస్టర్ ఇనాయత్ భాష తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారి, హిందూపురం సీనియర్ కరాటే మాస్టర్ శ్రీనివాసులు, కదిరి కరాటే మాస్టర్ అక్బర్ ఆలీతోపాటు, సీనియర్ బ్లాక్ బెల్టర్స్ నవ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కరాటే నేర్పడం విద్యార్థి దశలోనే కొనసాగించాలని, ముఖ్యంగా బాలికలకు రక్షణ కవచములా ఉంటుందని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు విద్యార్థి దశలోనే తమ పిల్లలకు చదువుతోపాటు కరాటే శిక్షణ ఇవ్వడం ఎంతో ముఖ్యము అని తెలిపారు. కరేటే మాస్టర్ ఇనాయత్ భాష చేస్తున్న ఈ కరాటే శిక్షణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కరాటే నేరవడం వలన ఆరోగ్యంతో పాటు, మెదడుకు మంచి ఉత్తేజము కలుగుతుందన్నారు. కరాటే ఆత్మరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్, బెల్స్ బెల్ట్ లను అందజేశారు. హెడ్మాస్టర్ మేరీ వర కుమారి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కరాటే మాస్టర్ చేస్తున్న ఈ కరాటే శిక్షణ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని, తెలుపుతూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img