Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

జాతీయ స్థాయి హాకీ పోటీలకు కేహెచ్ ప్రభుత్వా డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎంపిక…

కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం: జాతీయస్థాయి హాకీ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎం శ్రావణి ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్- ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్- జీవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో ఎలమంచిలి లో జరిగిన అంతర్ రాష్ట్రస్థాయి పోటీలలో శ్రావణి ఉత్తమ ప్రతిభను కనపరిచి ఈనెల ఒడిస్సా రాష్ట్రంలోని రూర్కెలలో 27 నుండి జూలై 7 వరకు జరగబోయే జాతీయస్థాయి జట్టుకు ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణినీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ ఆనందు, అధ్యాపకులు చిట్టెమ్మ, షమీముల్లా, కిరణ్ కుమార్, గోపాల్ నాయక్, పావని, భువనేశ్వరి, పుష్పావతి, గౌతమి, స్వామి తోపాటు బోధనేతర బృందము, తోటి విద్యార్థులు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img