Friday, May 31, 2024
Friday, May 31, 2024

ఈనెల 13వ తేదీ వరకు మద్యం షాపులు బంద్

సెబ్బ్ సీఐ గురు ప్రసాద్
విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో గల మద్యం షాపులు అన్నీ కూడా ఈనెల 11వ తేదీ రాత్రి 7 గంటల నుండి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మద్యం దుకాణాలను పూర్తిగా బంద్ చేయాలని సేబ్ సీఐ గురు ప్రసాద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇదివరకే మా జిల్లా అధికారులు మద్యం షాపుల వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, తప్పక ఆదేశాలు మద్యం షాపు యజమానులు పాటించాలని తెలిపారు. ఈనెల 13వ తేదీ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img