Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు

: సీఐ మునిస్వామి

విశాలాంధ్ర-రాప్తాడు : ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాప్తాడు అర్బన్ పీఎస్ సీఐ మునిస్వామి అన్నారు.
జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్ ఆదేశాలతో ప్రసన్నాయపల్లి, రాప్తాడు గ్రామాల్లో మంగళవారం ఉదయం కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ రెండు గ్రామాలలోను ప్రధాన రహదారులు, కాలనీల గుండా కవాతు కొనసాగింది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజల్లో భరోసా కల్పించారు. స్థానిక పోలీసులతో పాటు బి.ఎస్.ఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img