Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

కార్మికులపై అధికారుల కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి

. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వైజ్ఞానిక శిక్షణా తరగతులు జయప్రదం చేయండి
. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బరాయుడు

విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురము నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పార్కు వర్కర్లపై అధికారుల కక్ష్య సాధింపులు ఆపాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బరాయుడు డిమాండ్ చేశారు,
జూలై 24,25 తేదీల్లో మదనపల్లి హార్సిలీ హిల్స్ లో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది, ఈ సందర్భంగా పోరుమామిళ్ళ సుబ్బరాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం దిశగా చర్చలు జరపాలన్నారు,పోయిన సమ్మెలో డిమాండ్ చేసిన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు,స్థానిక మున్సిపాలిటీల్లో ఈ పి ఎఫ్ , ఈ ఎస్ ఐ సమస్యలు ఎక్కువయ్యాయని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు,పోయిన ప్రభుత్వం ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచలేదని ఈ ప్రభుత్వమైనా పారశుద్ద్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నారు,పర్మినెంట్ కార్మికులకు సరెండర్ లీవ్స్ ఎన్ క్యాష్ మెంట్,బకాయి ఉన్న డిఏ లు వెంటనే ఇవ్వాలన్నారు,మున్సిపల్ స్కూల్స్ లో పనిచేస్తున్న స్వీపర్లు&వాచ్మెన్ల కు వేతనాలు పెంచాలనే అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ నిర్ణయించడానికి ఈ నెల 24,25 తేదీలల్లో మదనపల్లి హార్సిలీహిల్స్ లో జరుగు మున్సిపల్ కార్మికుల వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా అధ్యక్షుడు చిరంజీవి,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వేణు,నాగేంద్రబాబు,కుళ్ళాయి రెడ్డి,తిరుమలయ్య,
శివకృష్ణ,ఎర్రప్ప,ప్రసాద్,రామాంజి తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img