Friday, June 14, 2024
Friday, June 14, 2024

పవన్ కళ్యాణ్ ఫోటో కి పాలాభిషేకం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దహనానికి నిరసనగా బుధవారం నియోజకవర్గ నాయకులు కుమార్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం ఎక్కడైతే దిష్టి బొమ్మ దహనం చేసారో అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేసి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం జరిగింది ఈ సందర్బంగా నియోజకవర్గ నాయకులు కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలలో మంచి మాటలు పరిగణలోకి తీసుకోకుండా వాలెంటీర్స్ ని వైసీపీ నాయకులు రెచ్చగొట్టి దిష్టి బొమ్మలు దహనం చేయిస్తున్నారని ఏ ఒక్క వాలంటీర్ కూడా స్వచ్ఛందంగా రాలేదు వైసీపీ నాయకులు ముందుండి దిష్టి బొమ్మలు దహనం చేయించారు అధికారన్ని ఉపయోగించి కనీసం పోలీస్ వ్యవస్థను కూడా లెక్కచేయకుండా దిష్టి బొమ్మలు దహనం చేశారు, ఈ సమయంలో వాలంటీర్ కు కొన్ని విషయాలు తెలియచేస్తున్నాము ముందు మీరు చదివిన చదువు ఎంత, మీరు పని చేస్తున్న పని ఎంత, మీకు వస్తున్న జీతం ఎంత సెక్యూరిటీ గార్డ్లు, హౌస్ కీపింగ్ పని, చివరికి కరువు పని చేసే వారికి పది వేల పైన వస్తుంది ప్రతి చిన్న ఉద్యోగం చేసుకునే వారికి కూడా సంవత్సరానికి ఒకసారి పది శాతం జీతం పెరుగుతుంది నాలుగు సంవత్సరాలనుండి రూపాయి జీతం పెరిగిందా మీకు మీరేమైనా బానిసలుగా ఉన్నారా ఇలాంటి విషయాలు పైన పోరాటం చేయండి అప్పుడు జనసేన కూడా మీకు మద్దతుగా ఉంటుంది అంతే కానీ వైసీపీ నాయకులు మాటలు విని మీ ఎదుగుదల గురించి మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలు దహనం చేయడం వల్ల జనసేన ఆశయాలు పెరుగుతాయి తప్ప పవన్ కళ్యాణ్ స్థాయి ఇంచు కూడా కడపలేరని ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు మేము కాల్చలేక కాదు మా అధ్యక్షులు నేర్పిన వినయం పోలీస్ వ్యవస్థ మీద గౌరవంతో శాంతియుత నిరసన తెలపడం జరింగింది ఇంకో సారి ఇలాంటి సంఘటనలు జరిగితే మీ పద్ధతిలోనే సమాధానం ఉంటుంది అని వైసీపీ నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెనుకొండ మండల కన్వీనర్ మహేష్, మండల ఉపాధ్యక్షులు మంజునాథ.నాయకులు బంగారం, రాజేష్, వీరమహిళలు శ్రీదేవి, శిరీష, పద్మావతి, యువ నాయకులు హరి నాయక్,మల్లేష్, శ్రీకాంత్, అభి, శ్రీనివాస్ మరియు నాయకులు .సాదిక్ .శివకుమార్ .గిరి. గోవిందు. ప్రభాకర్. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img