Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

యోగాతో మానసిక ప్రశాంతత

ఆరోగ్యవంతమైన జీవితానికి యోగ సాధన చెయ్యాలి

సమాజంలో అందరికీ యోగాను చేరువ చేయాలి
ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు
విశాలాంధ్ర -అనంతపురం : పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు, నర్సులు, మినిస్టీరియల్ స్టాప్, సెక్యూరిటీ స్టాఫ్, శానిటేషన్ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ… మన దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని, మనతోపాటు సమాజంలోని అందరినీ యోగాకి సంసిద్ధత చేయాలని, యోగ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతామని తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కె ఎస్ ఎస్ వేంకటేశ్వర రావు మాట్లాడుతూ… దీర్ఘకాలిక నొప్పులు, జబ్బులను యోగా మరియు ప్రాణాయామంతో నయం చేయవచ్చు అని, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, మానసిక ఉల్లాసానికి యోగ ఎంతగానో సహకరిస్తుందని వైద్య విద్యార్థులు ప్రతిరోజు యోగా బ్యాసన చేయడం ద్వారా ఏకాగ్రత కుదురుతుందని తెలిపారు. అనంతరం యోగా శిక్షకులు మారుతి ప్రసాద్, హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ యోగా శిక్షకులు డాక్టర్ శంకర్ నారాయణ, ప్రాణాయామ యోగ శిక్షకులు ముద్దూరి నాని నఓమి ల పర్యవేక్షణలో అందరితో యోగ ప్రోటోకాల్ ప్రకారము యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మీనాక్షమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రవికాంత్ రమణ అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ తెలుగు మధుసూదన్, డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ ప్రొఫెసర్ డాక్టర్ సుచిత్ర శౌరి, మెన్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ గాలేటి చంద్రశేఖర్, ఆర్ ఎం ఓ లు డాక్టర్ పద్మజ, డాక్టర్ హేమలత, డాక్టర్ సునీత, డాక్టర్ భాస్కర్ నాయక్, డాక్టర్ వరదరాజులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, నర్సింగ్ సూపర్ ఇంటెండెంట్ రజని, , ఫిజికల్ డైరెక్టర్ నరసింహ నాయక్, నర్సులు సంఘం ప్రెసిడెంట్ శ్రీదేవి, ఎర్రమల సుజిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img