Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

విద్యాశాఖ డివిజన్ పరిధిలో మండలాలు మార్పుపై వినతి

విశాలాంధ్ర- పెనుకొండ : పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఆంధ్రప్రదేశ్ వారు ఇటీవల విడుదలచేసిన Rష. చీశీ. జుూజు 11024/13/2023. జుూు-1 సీసీ తేది 07.8.2023 ప్రకారం శ్రీ సత్య సాయి జిల్లా లోని లేపాక్షి మండలంను కొత్తగా ఏర్పాటు చేసిన కదిరి డివిజన్ పరిధిలోకి, అలాగే కదిరి డివిజన్ పరిధిలోని తలుపుల మండలాన్ని పెనుకొండ డివిజన్ పరిధిలోకి వచ్చునట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఆశాస్త్రియ మరియు అననుకూలమైన నిర్ణయం. దీనిని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్య సాయి జిల్లా శాఖ తరపున ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని సత్యసాయి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జయచంద్రారెడ్డి , సుధాకర్, డిమాండ్ చేశారు..
కారణం లేపాక్షి మండలం పెనుకొండకి 50 కి. మీ. దూరం లో ఉంటుంది. అదేవిదంగా తలుపుల మండలం కదిరికి 25 కి. మీ. దూరంలో ఉంటుంది. తలుపుల నుంచి పెనుకొండ కు 103 కి. మీ. ఉంటుంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని లేపాక్షి మండలంను డివిజన్ పరిధిలోనే, అదేవిదంగా తలుపుల మండలంను కదిరి డివిజన్ పరిధిలోనే కొనసాగేలా పునఃపరిశీలన చేసి తగు చర్యలు ప్రభుత్వం తీసుకునే విధంగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కి వినతి పత్రాన్ని అందజేస్తూ మీ ద్వారా శ్రీ సత్య సాయి జిల్లా శాఖ తెలియజేస్తున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, ప్రధానోపాధ్యాయులు గోవిందరావు ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img