Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

చెట్లను నాటడం పవిత్రమైన బాధ్యత

హరిత అనంత సాకారం దిశగా చెట్లను విస్తృతంగా నాటాలి
: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర అనంతపురం : పవిత్రమైన బాధ్యతగా చెట్లను నాటడం చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని రెండవ రోడ్ లో ఉన్న పొట్టి శ్రీరాములు నగర పాలకోన్నత పాఠశాలలో శనివారం ఏజీఎస్ ఫౌండేషన్ చేపట్టిన ఉచిత చెట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం మొదలైందని, జిల్లాలో విస్తృతంగా మొక్కల పెంపకం కార్యక్రమం మొదలు పెట్టామన్నారు. ఏజీఎస్ ఫౌండేషన్ తరఫున అందించిన ఉచిత మొక్కలను విద్యార్థులంతా ఇంటికి తీసుకువెళ్లి చెట్లను నాటి జాగ్రత్తగా పెంచుకోవాలన్నారు. మొక్కలు నాటే ప్రక్రియను పవిత్రమైన పనిగా చేపట్టాలన్నారు. చెట్లను సరిగా నాటాలని, చెట్లు నాటడం వల్ల కలిగే మంచిని, ఏమేమి లాభాలు ఉన్నాయి అనేది విద్యార్థులకు తెలియజేయాలన్నారు. తల్లితోపాటు చెట్టు మీకు సేవ చేస్తుందని, చెట్లతో రిలేషన్షిప్ ఉంచుకోవాలన్నారు. హరిత అనంత సాకారం దిశగా చెట్లను విస్తృతంగా నాటాలని, ఎక్కడ అవసరం ఉందో అక్కడ చెట్లు నాటాలన్నారు. విద్యార్థులందరికీ మంచి ఆరోగ్యం, విద్య అందించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు చెట్లను పంపిణీ చేసి, చెట్లను నాటారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ పివీఎస్ఎన్ మూర్తి, పాఠశాల హెచ్ఎం రమేష్ బాబు, ఏజీఎస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ ప్రమీలమ్మ, ఆమె కుమారుడు డిస్కవర్ ఏటిపి అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img