Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

భారత్ బాస్కెట్ బాల్ టీంలో కే.ద్వారకనాథ్ రెడ్డి ఎంపికవడం జిల్లాకు గర్వకారణం

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం : భారత్ బాస్కెట్ బాల్ టీంలో అనంతపురం నగరానికి చెందిన కే.ద్వారకనాథ్ రెడ్డి ఎంపికవడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. భారత్ బాస్కెట్ బాల్ టీంలో జిల్లాకు చెందిన కే.ద్వారకనాథ్ రెడ్డి ఎంపికకాగా, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ని కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం నగరంలోని ద్వారకానగర్ కు చెందిన కే.ద్వారకనాథ్ రెడ్డి అండర్- 18లో భారత్ బాస్కెట్ బాల్ టీంకి ఎంపిక కావడం పట్ల అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రీడాకారుడు కే.ద్వారకనాథ్ రెడ్డి తండ్రి ద్వారాక హరినాథరెడ్డి మాట్లాడుతూ శ్రీలంకలోని కొలంబోలో జూలై 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగిన అండర్ -18 లో ఏషియన్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ (ఏబిసి)లో భారత్ తరపున కే.ద్వారకనాథ్ రెడ్డి గెలుపు పొందడం జరిగిందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎఫ్.ఐ.బి.ఏ) ఆధ్వర్యంలో మాల్దీవులులోని అమెన్జార్డెన్ నగరంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే పోటీలలో అండర్- 18లో భారత్ బాస్కెట్ బాల్ టీంకి తన కుమారుడు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జరిగే శిక్షణ క్యాంపులో పాల్గొననున్నట్లు తెలిపారు. తన కుమారుడు కే.ద్వారకనాథ్ రెడ్డి బెంగళూరులోని జైన్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడని, భారత్ బాస్కెట్ బాల్ టీంకి ఎంపిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ తన కుమారుడిని అభినందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్డిఓ షఫీ, బాస్కెట్ బాల్ కోచ్ ఎల్.వంశీ రెడ్డి, తల్లి చంద్రిక, సోదరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img