Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

రైతు బజార్ ఏర్పాటు చేయండి

విశాలాంధ్ర-తాడిపత్రి : స్థానిక వ్యవసాయ కార్యాలయం వద్ద బుధవారము రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరాముడు యాదవ్సి పిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అసిస్టెంట్ ఏవోకు వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడిపత్రి మండలం చుట్టూ దాదాపు 26 పంచాయతీ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో రైతులు ఎంతో శ్రమించి కూరగాయ పంటలు పండిస్తున్నారు. పండించిన కూరగాయలను కూరగాయల మార్కెట్ కు తెస్తే కూరగాయల వ్యాపారస్తులు రైతుల వద్ద నుండి తక్కువ రేటుకు కొనుగోలు చేసి ప్రజలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారన్నారు. దీంతో ఇటు రైతు నష్టపోతున్నాడు. కూరగాయలు కొని తినే సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. మధ్య దళారీలు అధిక రేట్లకు అమ్ముకొని బాగుపడుతున్నారు. కావున నూతన ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే రైతులను, సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని తాడిపత్రి ప్రాంతంలో రైతు బజారును ఏర్పాటు చేయాలని, లేని పక్షమున రైతులను, ప్రజలను కలుపుకొని పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాస్ యాదవ్, రమణ, ఉమా గౌడ్ రత్నమయ్య, రామాంజనేయులు, రామాంజనేయ యాదవ్, చిన్న సంజీవులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img