Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి పాటుపడండి

స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్. టి యం. బషీర్, డాక్టర్ వై. సోనియా

విశాలాంధ్ర – ధర్మవరం : ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి ఓటర్లు పాటుపడాలని స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్. టిఎం. బషీర్, డాక్టర్. వై. సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా పలు ఆరోగ్య విషయాలను పత్రికాముఖంగా, కరపత్రాల రూపంలో ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని, ఓటు వేయడానికి వెళ్లాలని సూచించారు. వృద్ధులు ఆరోగ్యం సరిగా లేనివారు గర్భిణీ స్త్రీలు బాలింతలు ఉదయం 6 గంటలకే ఎలక్షన్ బూతు వద్దకు చేరుకొని, త్వరగా ఓటు వేయడానికి ప్రయత్నం చేయాలని తెలిపారు. మీ ఓటు యొక్క ఎలక్షన్ బూతు ఎక్కడ ఉన్నదో ముందుగా తెలుసుకోవాలని, ఇంట్లోనే నీరును ఎక్కువగా తాగాలని, ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు చేతి రుమాలు/ గొడుగు/ ప్రాఫ్/ టవల్ తీసుకొని వెళ్లాలని తెలిపారు. ఓటు వేయడానికి ముందుగానే టిఫిన్ లేదా భోజనం చేసి వెళ్లాలని తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు/ ఆధార్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ తదితర వాటిని వెంట తీసుకొని వెళ్లాలని తెలిపారు. ఎవరికి/ ఏ గుర్తుకు ఓటు వేయాలో ముందుగానే నిర్ణయం తీసుకొని వెళితే మంచిది అని తెలిపారు. డబ్బులకు, కులమతపరమైన ప్రలోభాలకు లోను కాకుండా శాంతి, స్వేచ్ఛ, సామరస్యము, సమానత్వాన్ని కాపాడగలిగే మంచి నాయకున్ని మీ ఓటు ద్వారా ఎన్నుకోవాలని తెలిపారు. ఓటు కార్డు పోగొట్టుకున్న వారు ఓటరు స్లిప్ తో పాటు ఆధార్ కార్డు లేదా వేరే ఇతర వాటిని చూపి ఓటు వేసే అవకాశం ఉందని తెలిపారు. ఓటు వేసిన వారందరికీ మా స్పందన హాస్పిటల్ ఆవరణములోని ఈ క్యాంటీన్ లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితముగా మజ్జిగ చల్లని నీరు అందించబడునని తెలిపారు. ఓటు వేయడానికి వచ్చి వడదెబ్బకు గురైన వారికి మా స్పందన హాస్పిటల్ లో ఉచితంగా ఓటింగ్ రోజు చికిత్స చేయబడునని తెలిపారు. కావున ఓటు వజ్రాయుధం లాంటిదని, ఆ ఓటుతోనే మన రాష్ట్ర అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉందన్న విషయాన్ని ప్రతి ఓటరు గుర్తించుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img