Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా జరిగిన రాతి గోపురం ప్రతిష్ట

ఆలయ కమిటీ

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని యాదవ వీధిలోని స్వయంభు వరసిద్ధి వినాయక దేవస్థానంలో గర్భగుడి పై భాగములో రాతి గోపురం ప్రతిష్టను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తాదులు, దాతలు, కమిటీ అర్చకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మాల గుండ్ల మల్లికార్జున, కార్యదర్శి రమణారెడ్డి, సహాయ కార్యదర్శి కోటి వెంకటేష్, కోశాధికారి పిన్ను సురేష్ బాబు మాట్లాడుతూ మూడు కోట్ల రూపాయల అంచనాతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నదని, దాతల సహాయ సహకారములతోనే నిర్మాణం వేగవంతంగా అవుతోందని తెలిపారు. ఆలయ కట్టడాలు పూర్తిగా రాతితోనే నిర్మాణం జరుగుతోందని, 25 అడుగుల ఎత్తులో క్రేన్ సహాయముతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అర్చకులు సుబ్రహ్మణ్యం శాస్త్రి, రాజాలు తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం ఇంకనూ దాతల సహాయ సహకారాలు ఎంతో అవసరమని, ఆసక్తిగల దాతలు ఆలయంలో సంప్రదించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు, దాతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img