విశాలాంధ్ర -జె ఎన్ టి యుఏ:సీఎం కళ్యాణ్ దుర్గం పర్యటన నేపథ్యంలో రైతుల పక్షాన 2022 పంటల బీమా పరిహారం అన్ని పంటలకు వర్తింపచేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న తరుణంలో శనివారం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుళాయి స్వామి, సహాయ కార్యదర్శి వంశీ ,ఆనంద్, విశ్వ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ.. వేరుశనగ, దానిమ్మ, మిరప, కంది , మొక్కజొన్న , ఆమిదం పంట వేసి నష్టపోయిన రైతులకు 25వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్, అపర భద్ర అక్రమ కట్టడాలు, హెచ్ ఎల్ సి నీరు సమస్యలను పరిష్కరించాలని కోరారు.