అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
విశాలాంధ్ర : అనంతపురం :మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి వారి జీవితంలో ఆనందం నింపడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టినట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆల్ మేవా) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ మేవా నాయకులు ఎమ్మెల్యేను కలిసి సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయనను శాలువాల ను కప్పి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ముస్లిం , మైనార్టీల సమస్యలను పరిష్కరించాలని నాయకులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందిస్తూ రాష్ట్రంలో ప్రజా రంజక సంక్షేమ పాలన అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముస్లిం , మైనార్టీల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ , బీసీ మైనారిటీ లకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం దశల వారీగా నెరవేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క మైనార్టీకి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ముస్లిం మైనారిటీ జీవితాల్లో మంచి రోజులు రానున్నాయని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజ అభివృద్ధికి కృషి చేయనున్నారని యం ఎల్ ఏ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ మేవా రాష్ర్ట గౌరవ అధ్యక్షులు వై. ఫక్రొద్దీన్, జిల్లా అధ్యకులు షేక్షవలి, ప్రధాన కార్యదర్శి ఫరూక్, ఉపాధ్యక్షులు జిలాన్ ఆశ్రఫ్అలీ, దౌల,హిదయతుల్ల, అబ్దుల్ రసూల్, సర్దార్, రఫీ, అన్వర్, దావూద్ తదితరులు పాల్గొన్నారు.