Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

ఆదరించారు అండగా ఉంటా

పెంచిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట
విశాలాంధ్ర తనకల్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన 4000 రూపాయలతో పాటు ఏప్రిల్ నెల నుండి 1000 చొప్పున కలిపి 7000 రూపాయల పంపిణీ కార్యక్రమంలో కదిరి టిడిపి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొనడానికి వి చ్చేయగా మండల నాయకులు ప్రజలు హారతులతో బానిసంచాలతో ఘన స్వాగతం పలికారు పలువురికి పింఛన్లు అందజేసి అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించారని వారికి అండగా ఉంటామని తెలియజేశారు మండల వ్యాప్తంగా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు గుళ్ళలో ప్రత్యేక పూజలు పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు ప్రజలు నిర్వహిస్తున్నారని పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకొని వారిని సంతృప్తి పరచడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. మనం మన పిల్లలు సమాజం సమాజంలో ఉన్న అసమానతలు వీటి భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని మరొకసారి గుర్తు చేశారు. ఏ ఒక్కరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆత్మస్త్యైర్యంతో ముందుకు సాగి ప్రభుత్వ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పుష్టి సాధించుకోవాలన్నారు. రాష్ట్రంలో త్వరలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేలా ప్రణాళికలు రూపొందించబడుతున్నాయని యువతకు ఉపాధి రైతులకు అండ కార్మికులకు కర్షకులకు అన్ని వర్గాలకు సమ న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి తెలుగు యువత అధ్యక్షుడు కావలి ప్రవీణ్ కుమార్ సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి రాజారెడ్డి మాజీ కన్వీనర్ శంకర్ నాయుడు ప్రభాకర్ రెడ్డి దేశాయ్ విదుర శేఖర్ రెడ్డి పీజీ మల్లికార్జున అరటికాయలు రవి నాగభూషణ హరి నాయక్ బ్రహ్మానందరెడ్డి మహబూబ్ బాషా దస్తగిరి తోట సరోజమ్మ శోభారాణి జిలకర ప్రసాద్ నాయుడు తోబాటు మండలంలోని నాయకులు కార్యకర్తలు ప్రజలుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img