విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వెన్నెముక సర్జరీ చేయించుకుని చికిత్స పొందుతున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ పెద్దయ్యని సోమవారం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి వికె కృష్ణుడు,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి కామ్రేడ్ పెద్దయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు, అనంతరం వైకుంఠం జయచంద్ర చౌదరి, ఆయన కుమారుడు సాయి దీప్ లు కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు,