పట్టణంలోని కేశవ నగర్ నందు గల వాసవి బాలికల జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే స్థానిక దేవంగ కళ్యాణమండపం నందు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు గల మరొక్క మెట్టును మీరు అధిగమించి,భవిష్యత్తులో విద్యార్థులందరూ ఉన్నత స్థాయిని అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.వాసవి బాలుర కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మంచి విజయావకాశాలు గల వేదిక పై విద్యార్థులు ఉండాలని కోరుకుంటున్నానని, పరీక్షలలో ఒత్తిడిని జయించే శక్తిని మీకు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.