Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

మంచిర్యాలలో బజాజ్‌ అలియంజ్‌ ఇన్సూరెన్స్‌ సేవలు

మంచిర్యాల్‌: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ జనరల్‌ఇన్సూరెన్స్‌ కంపెనీలలో ఒకటైన బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తెలంగాణలోని మంచిర్యాల్‌లో దాని కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా బజాజ్‌అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, జియో నేషనల్‌ హెడ్‌ అమితేష్‌ ఆనంద్‌ మాట్లాడుతూ భారతదేశంలోని టైర్‌ 2, టైర్‌ 3 నగరాల్లో ఇన్సూరెన్స్‌ వ్యాప్తినిపెంచడం మన పౌరులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యంగా తమ సంస్థ కార్యకలాపాలు విస్తరిస్తున్నామన్నారు. బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ దాని ఉనికిని మరింత బలోపేతం చేయడానికి, ఈ ప్రాంతంలో దాని కస్టమర్లకు సేవలు అందించడానికి ఈ కొత్త కార్యాలయం ఒకవ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలోని మంచిర్యాల్‌లో బెల్లంపల్లి చౌరాస్తా డోర్‌ నెంబరు -12-329, 2వ అంతస్తు, సుజుకి షోరూమ్‌ పైన ఈ నూతన కార్యాలయం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img