ముంబయి: గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ద్వారా మొబైల్ ఏఐ యుగానికి స్వాగతం పలికినట్లు శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఎంఎక్స్ బిజినెస్ ప్రెసిడెంట్, హెడ్ డాక్టర్ ఎం.ఎన్.రోప్‌ా తెలిపారు. గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌ను అభివృద్ధి చేయడం తన కెరీర్‌లో అత్యంత లాభదాయకమైన కాలమని, ఇంజనీర్‌గా నమ్మశక్యం కాని ఆవిష్కరణలకు ఎన్నో ఉదాహరణలను చూశానని, కానీ, ఏఐ అనేది ఈ శతాబ్దపు అత్యంత పరివర్తనాత్మక సాంకేతికత అని తెలిపారు. ఇది శాంసంగ్, మొబైల్ పరిశ్రమకు మాత్రమే కాకుండా, మానవాళికి గొప్ప మార్పును తెస్తుందన్నారు. ఫోన్‌లలో ఏఐను అనుసంధానించడం ఒక విప్లవమని, మొబైల్ అనుభవాలకు ఇది సరికొత్త యుగమని అభివర్ణించారు. శాంసంగ్ గెలాక్సీ ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఏఐ ఫీచర్లలో ఒకటి సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్, ఇది సహజమైన ఆవిష్కరణ కమ్యూనికేషన్ సాధనాలు భాషా అడ్డంకులను తొలగిస్తాయని తెలిపారు.