విశాలాంధ్ర/ఖమ్మం: జీ తెలుగు ప్రతిష్టాత్మక కార్యక్రమం డ్రామా జూనియర్స్ సరికొత్త సీజన్‌తో వచ్చేస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పిల్లలకు అవకాశం కల్పిస్తోందది. చిన్న పిల్లల్లో నటనా ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించామన్నారు. 3 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు డ్యాన్స్, పాటలు పాడటం, నటన, మ్యాజిక్ ట్రిక్స్, మార్షల్ ఆఆర్ట్స్తో పాటు మరేదైనా టాలెంట్ ఉన్నా ఇదే చక్కని అవకాశమన్నారు. జీ తెలుగు పాపులర్ షో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఆడిషన్స్‌తో మునుపెన్నడూ లేని విధంగా బిగ్ స్టేజ్‌పై మెరిసే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లల్లోని టాలెంట్‌ను ప్రతిబింబించేలా 2 నిమిషాల నిడివి గల వీడియోను డ్రామాజూనియర్స్ఎస్7ఆడియెన్స్.జీ5.కామ్‌లో పోస్ట్ చేయాలనీ, లేదా 9100054301, మెయిల్‌కు కూడా పంపించవచ్చన్నారు. లిప్ సింక్ ఉన్న వీడియోలు పరిగణనలోకి తీసుకోబడవని వివారించారు.