Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఎన్నికల కమిషన్‌ బధిరాంధత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు తెరిచి ఎప్పుడైనా నిజం చెప్పారన్న అనుమానం బహుశ్‌: ఆయన భక్ర జనానికి కూడా ఉండి ఉండదు. కానీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రచారంలో పెడ్తున్న అభద్ధాలు శ్రుతి మించి పోతున్నాయి. పాత అబద్ధాలను అలసట, విరామం లేకుండా వల్లించడంతో పాటు రోజుకో సరికొత్త అబద్ధమాడుతూనే ఉన్నారు. ఈ అసత్యాల పరమ లక్ష్యం ముస్లింల మీద విద్వేషం నింపడం. 80 శాతం ఉన్న హిందువుల ఓట్లలో అత్యధిక శాతం బీజేపీకే దక్కాలన్న ఉద్దేశంతో ముస్లింలను హిందువులకు ప్రధాన శత్రువులుగా చూపిస్తున్నారు. అధికారంలో ఉన్న పది ఏళ్ల కాలంలో ఒరగబెట్టింది ఏమిటో చెప్పుకోవడానికి ఎటూ అవకాశం లేనందువల్ల ఓ వేపు అసత్య ప్రచారం, మరో వేపు ముస్లింల విధ్వేషం నింపడం ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రధానాంశమై పోయింది. ఒకప్పుడి బీజేపీకి మిత్ర పక్షంగా ఉండి రైతుల ఉద్యమ సమయంలో తెగతెంపులు చేసుకున్న అకాలీ దడల్‌ కు సైతం మోదీ అబద్ధాలు గొంతు దిగడం లేదు. ఇవాళ ఆయన ముస్లింల మీద విరుచుకు పడుతున్నారు రేపు సిక్కుల మీద మండి పడతారు అని అకాలీ దళ్‌ బాహాటంగానే నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కనక అధికారంలోకి వస్తే దేశ సంపదను ‘‘అధిక సంతానంగల చొరబాటు దార్లకు’’ పంచి పెడ్తుంది అని మోదీ దుష్ప్రచారానికి దిగారు. అధిక సంతానం ఉన్న వారు అంటే ఆయన అభిప్య్రాయం ముస్లింలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘‘మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము ‘‘చొరబాటుదార్లకు పందేరం చేస్తే మీరు సహిస్తారా?’’ అని బహిరంగ సభకు తరలించుకు వచ్చిన జనాన్ని మోదీ ప్రశ్నించారు. బీజేపీ సకల విధ ప్రలోభాలు కల్పించి తరలించగా వచ్చిన వారు ‘‘సహిస్తాం’’ అని ఎలా సమాధానం చెప్పగలరు? ‘‘మనకు జరిగిందే అన్యాయం అనుకోవడం మన తత్వం. ఇవాళ వాళ్ల వంతైతే రేపు మన వంతూ వస్తుంది’’ అని అకాలీ దళ్‌ అధికార ప్రతినిధి పరమహన్స సింగ్‌ రొమన అన్నారు. కాంగ్రెస్గనక గెలిస్తే మీ ఇళ్లన్నీ సఒదా చేసి మంగళ సూత్రాలతో సహా మీ సంపత్తినంతా దోచుకును ‘‘చొరబాటుదార్లకు’’ పంచేస్తారు అని మోదీ గత రెండు రోజులుగా పాడిరదే పాటగా చెప్తున్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో లేని విషయాలను కూడా ఉన్నట్టు చిత్రీకరించి జనాన్ని భయపెట్టడానికి మోదీ ఏ అవకాశమూ వదిలిపెట్టడం లేదు. ఆయన ప్రసంగాల ధోరణిని నిశితంగా పరిశీలించి చూస్తే ఓటమి భయం ఆయనను వెంటాడుతోందని, నిరాశకు గురైనందువల్లే ఇలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించడం సులభమే. కానీ ఇలాంటి మాటలన్నీ గుండెలోతుల్లోంచి వచ్చినవేనని గ్రహించడానికి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన ప్రసంగాల ధోరణి గమనిస్తే అర్థం అవుతుంది. 19వ తేదీన జరిగిన మొదటి దశ పోలింగ్‌ పై జనం అంతగా ఉత్సాహం కనబరచలేదని విశ్లేషకులు వింగడిస్తున్నారు. ఇందులో నిజం ఎంతో ఊహ ఎంతో జూన్‌ నాల్గవ తేదీనగానీ తేలదు. ఎస్‌.సి./ఎస్‌.టి./ఒ.బి.సి.లకైతే తాను రిజర్వేషన్లు అమలు చేస్తాను కానీ మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించే ప్రశ్నే లదని మోదీ ఎవరూ అడక్కుండానే నొక్కి చెప్పారు. ఆయన పేర్కొన్న రిజర్వేషన్లలో మొదటి రెండు వర్గాలకు రాజ్యంగామే ఆ సదుపాయం కల్పించింది. ఇందులో మోదీ ఘనత ఇసుమంత కూడా లేదు. ఒ.బి.సి.ల రిజర్వేషన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇతర వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి గురించి కూడా ఆలోచించాలని డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ రాజ్యాంగ రచన పూర్తి అయిన తరవాతే చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే దీనికోసం ప్రయత్నం ప్రారంభమైన విశ్వాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ప్రధానమంత్రి అయ్యే దాకా ఒ.బి.సి.లకు రిజర్వేషన్ల సదుపాయం కలగనే లేదు. ఒ.బి.సి. వర్గానికి చెందక పోయినా తన కులాన్ని ఒ.బి.సి. జాబితాలో చేర్పించిన మోదీ నుంచి అసత్యం తప్ప మరేదీ ఆశించలేం.
కానీ మొదటి దశ పోలింగ్‌ బీజేపీ నాయకులను, ముఖ్యంగా బీజేపీని గెలిపించే బృహత్తర బాధ్యతను బుజాన వేసుకున్న మోదీని బెంబేలెత్తిస్తోంది. అందుకే దిక్కు తోచని స్థితిలో మోదీ రెచ్చి పోయి మాట్లాడుతున్నారు. మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి దాకా ఏ ప్రధానమంత్రి ఇలా విషవమనానికి పాల్పడలేదు. అసత్యాలను ప్రచారం చేసే వారిని సహించేదే లేదని, వారి మీద చర్య తీసుకుంటామని ఎన్నికల కమిషన్‌ ప్రధానాధానాధికారి రాజీవ్‌ కుమార్‌ హుంకరిస్తున్నారు. అసత్య ప్రచారం చేసే వారి ప్రస్తుత మాటలనే కాక గతంలో వారి అబద్ధాలను కూడా పరిగణనలోకి తీసుకుని చర్య తీసుకుంటున్నామై గుప్పిళ్ల కొద్దీ హామీలు పడేస్తున్నారు. అన్ని బీరాలు పలికే రాజీవ కుమార్‌ ఎన్ని ఫిర్యాదులు అందినా మోదీకు ఒక్క నోటీసైనా జారీ చేయడానికి సాహసించలేదు. ఇక ఇంతకు ముందు మోదీ చెప్పిన అబద్ధాల మీద ఎన్నికల కమిషన్‌ చర్య తీసుకుంటుందని ఎలా నమ్ముతాం. ఎన్నికల కమిషన్‌ చరిత్ర పొడవునా అధికారంలో ఉన్న పక్షం అడుగులకు మడుగులొత్తని ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఈ జోకుకుందారీ బానిస మనస్తత్వం మోదీ హయాంలో వచ్చింది కాదు. అలాంటప్పుడ్‌ సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వసం చేసింది మోదీ అయితే ఆయన మీద పల్లెత్తి ఒక్క మాటైనా మాట్లాడే సాహసం రాజీవ్‌ కుమార్‌ చెస్తారని ఎలా అనుకోగలం? అసలు ఎన్నికల కమిషన్‌ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా తయారైంది. ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించడమే ఎన్నికల కమిషన్‌ ప్రదర్శిస్తున్న రాజును మించిన రాజభక్తికి తార్కాణం. ప్రజాస్వామ్య వ్యవస్థకు కాపలాదారుగా ఉంటూ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రధాన భాగమైన ఎన్నికలను నిష్పక్షపాటంగా నిర్వహించవలసిన బాధ్యత ఉన్న ఎన్నికల కమిషన్‌ మాయమై పోయి ఏళ్లు గడుస్తోంది. అబద్ధాలడి తప్పించుకోవడానికి, విద్వేష ప్రచారం చేయడానికి ఇక అవకాశం లేదని గత 16వ తేదీన గంభీరమైన ప్రకటనలు గుప్పించిన రాజీవ్‌ కుమార్‌ కు మోదీ చెప్పే అసత్యాలు, కొనసాగించే విధ్వేష ప్రచారం వినిపించడం లేదంటే ఎలా నమ్ముతాంగనక. అభివృద్ధి అన్న మోదీ మంత్రం పారడం లేదు. ఎందుకంటే దశాబ్ద కాలంగా అభివృద్ధి జాడే కనిపించలేదు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, తన మిత్ర బృందానికి దేశ వనరులను దోచి పెట్టడం లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము మోదీకి లేదు. అందుకే మళ్లీ హిందు-ముస్లిం రాజకీయ అస్త్రానికి సానబడ్తున్నారు. విద్వేషం వరదై పారుతోంది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో లేని అంశాలను ప్రస్తావిస్తూ మోదీ దుష్ప్రచారం కొనసాగిస్తూ ఉంటే ఎన్నికల కమిషన్‌ చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చున్నట్టు? మోదీ మీద చర్య తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నట్టు? మోదీ నోటిని ఎందుకు అదుపు చేయడం లేదు?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img