Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

రామ మందిరం నుంచి రాజ్యాంగం దాకా

అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంశం ఆధారంగా మూడు దశాబ్దాల పాటు బీజేపీ నడిపిన రాజకీయం 2024 సార్వత్రిక ఎన్నికలలో ఫలితాలు ఇస్తున్నట్టు కనిపించడం లేదు. మామూలు పరిస్థితుల్లో అయితే జనాన్ని మందిర నిర్మాణం ఆకర్షించినట్టుగా రాజ్యాంగ పరిరక్షణ ఆకట్టుకోదు. 400 కన్నా ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని అనేకమంది బీజేపీ నాయకులు అదే పనిగా ప్రకటిస్తున్నారు. అలాంటి ఆలోచన లేదని మోదీ చెప్పినా జనం నమ్మే పరిస్థితిలేదు. రాజ్యాంగాన్ని మార్చేస్తే దళితులకు, గిరిజనులకు కొనసాగుతున్న రిజర్వేషన్లు కుంచించుకు పోతాయన్న విషయం మాత్రం ప్రజలకు సులభంగానే అర్థం అయింది. అందుకే బడుగు బలహీన వర్గాలు క్రమంగా బీజేపీకి దూరమై పోయాయి. వీరిని సంఘటిత పరచడానికి ప్రతిపక్ష ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ఏం చేసింది, ఎంత మేరకు సఫలమైంది అన్న అంశం చర్చనీయాంశం అయినప్పటికీ ప్రజలకు మాత్రం బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు గల్లంతు అవుతాయన్న భయం పీడిస్తోంది. జనం దగ్గర మంగళ సూత్రాలు, బంగారం లాగేసి ముస్లింలకు పంచేస్తారని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో రాశారన్న మోదీ చెప్పిన పచ్చి అబద్ధం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రజలు సరిగ్గానే గ్రహించారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలోలేని అనేక అంశాలు ఉన్నట్టుగా మోదీ చిత్రించడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. ప్రజల నిత్య జీవితానికి సంబంధించిన ఏ ప్రధానాంశాన్ని చర్చకు రానివ్వకుండా కేవలం మతతత్వాన్ని, ముస్లింల మీద ద్వేషభావం పెంచడానికి మోదీ పథకం బోల్తా పడిరది. గత నాలుగు విడతల పోలింగ్‌ పై అంచనాలు ఇదే అంశాన్ని రుజువు చేస్తున్నాయి. మిగిలిన మూడు విడతల పోలింగులోనూ బీజేపీకి విజయావకాశలు పొంగి పొర్లి పోతున్న పరిస్థితీ లేదు. బిహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ గఢ్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీ, హర్యానా, చండీగఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలను హిందీ మాట్లాడే రాష్ట్రాలుగా పరిగణిస్తారు. హిందీ మాట్లాడే 11 రాష్ట్రాలలో కలిపి 226 లోకసభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికలలో వీటిలో 178 సీట్లను బీజేపీ దక్కించుకుంది. ఎన్‌.డి.ఎ. కూటమికి దక్కిన స్థానాలను లెక్కవేస్తే అవి 204 స్థానాలు అవుతాయి. అంటే అత్యధిక స్థానాలను బీజేపీ 2019లోనే గెలుచుకుంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సీట్లు సంపాదించే అవకాశం లేకపోగా చాలా చోట్ల ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు నాలుగు విడతల పోలింగ్‌లోనూ సానుకూలత పెరిగింది. అంటే ఈ ప్రాంతాల్లో ఎన్‌.డి.ఎ. బలం తగ్గడంతప్ప పెరిగే అవకాశం లేదు. ఎన్నికలలో విజయం సాధించడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పగలిగిన మోదీ, ఎంతగానైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నిపాట్లు పడ్డా ఫలితం ఉండేట్టు లేదు. నాలుగు దశల్లో పోలింగ్‌ జరిగిన ప్రాంతాలలో చూస్తే బీజేపీ 2019లో 132 స్థానాలు దక్కించుకుంది. మరో మూడు విడతల్లో 94 లోకసభ స్థానాలకు పోలింగ్‌ జరగవలసి ఉంది. గడిచిన విడతల్లో ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన నుంచి గట్టి పోటీ ఎదుర్కున్న ఎన్‌.డి.ఎ. కూటమి మిగతా మూడు విడతల్లోనూ మరింత తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పని పరిస్థితే ఉంది. ఛత్తీస్‌గఢ్‌ లోని 11 సీట్లల్లో 2019లో బీజేపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఈ సారి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. మధ్య ప్రదేశ్‌ లో 29 స్థానాలుంటే 2019లో బీజేపీ 28 చోట్ల విజయం సాధించింది. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలలో బీజేపీ అధికారం నిలబెట్టుకున్నప్పటికీ అనామకుడైన మోహన్‌ యాదవ్‌ ను ముఖ్యమంత్రిని చేయడం మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కే కాక బీజేపీ వర్గాలకే నచ్చలేదు. అందుకే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. కనీసం ఆరు సీట్లలో బీజేపీకి గడ్డు పరిస్థితే ఉంది.
గత లోకసభ ఎన్నికలలో బిహార్‌ లోని 40 స్థానాలలో జె.డి.(యు)తో కలిసి పోటీచేసి బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడూ నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని జె.డి.(యు) బీజేపీతో కలిసే ఉన్నప్పటికీ నితీశ్‌ కుమార్‌ కనీసం ఉత్సవ విగ్రహంగా కూడా మిగలలేదు. అదీ కాక 2019లో ఘోరంగా విఫలమైన రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి.) తేజస్వీ యాదవ్‌ నాయకత్వంలో బాగా పుంజుకుంది. ఆర్‌.జె.డి.కి కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతు కూడా ఉంది కనక బీజేపీ పరిస్థితి దిగజారక తప్పదు. ఇంతవరకు జరిగిన పోలింగులో బీజేపీ రెండు స్థానాలు సాధిస్తే గొప్ప అంటున్నారు. జార్ఖండ్‌ లో మొత్తం 14 స్థానాలు ఉంటే బీజేపీ 2019లో 12 సీట్లు స్వాధీనం చేసుకుంది. ఇంతవరకు జార్ఖండ్‌ లోని నాలుగు లోకసభ స్థానాలకే ఎన్నికలు పూర్తయ్యాయి. వీటిలో మూడిరట్లో కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చిందంటున్నారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేయడం ఆ రాష్ట్ర ప్రజలకు ఆగ్రహం కలిగించింది. దీనిని గిరిజనుల మీద దాడిగా పరిగణిస్తున్నారు. దిల్లీలోని ఏడు స్థానాల్లో, హర్యానాలోని 10 సీట్లు, చండీగఢ్‌ లోని ఒక్క స్థానంలో కూడా బీజేపీ ఎదురీదవలసి వస్తోంది. 2019లో ఈ స్థానాలన్నింటినీ బీజేపీ స్వాధీనం చేసుకుంది. కానీ రాజకీయ కక్షతో కేజ్రీవాల్‌ ను అరెస్టు చేశారన్న ఆగ్రహం దిల్లీ ప్రజల్లో కనిపిస్తోంది. దానికి తోడు ఈ సారి కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్‌ కు దిల్లీలో పొత్తు కుదిరింది. కేజ్రీవాల్‌ కు సానుభూతి సమకూరుతుండడం బీజేపీకి అపారమైన నష్టం కలగవచ్చు. హర్యానాలో త్రిముఖ పోటీ జరుగుతోంది. పైగా ఎన్‌.డి.ఎ.లో చీలిక వచ్చి గత మార్చిలో ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చింది. ఆ ప్రభుత్వమూ మైనారిటీలో పడి పోయింది. చండీగఢ్‌ లో కూడా ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన పుంజుకున్న జాడలున్నాయి. అంటే హర్యానా, చండీగఢ్‌ లో ఉన్న 18 స్థానాల్లో అత్యధిక నియోజకవర్గాలలో బీజేపీకి ఓటమి తప్పేట్లు లేదు. ఉత్తర ప్రదేశ్‌లో 80 స్థానాలంటే 2019లో ఎన్‌.డి.ఎ. కూటమికి 64 సీట్లు దక్కాయి. 39 స్థానాల్లో పోలింగ్‌ ముగిసింది. సమాజ్‌ వాదీ పార్టీకి, కాంగ్రెస్‌ కు పొత్తు కుదరడంతో బీజేపీ గుండెల్లో భయం గూడు కట్టుకుంది. మరో 41 సీట్లకు మిగతా మూడు విడతల్లో పోలింగ్‌ జరిగే చోట్ల కూడా బీజేపీకి అంత సానుకూలత ఏమీ లేదు. బెంగాల్‌ లోనూ ఎదురీత తప్పదు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి తిరుగులేని మెజారిటీ వస్తే రాజ్యాంగ స్వరూపమే మారిపోతుందన్న భయం బలహీన వర్గాలలో పేరుకుపోయింది. అందుకే ప్రతిపక్షానికి స్పష్టమైన అనుకూల పవనాలు బయటికి కనిపించకపోయినా అంతర్గతంగా ప్రతిపక్షాలు బలం పుంజుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img