Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

లేగ దూడల సంరక్షణతో ఆర్థిక వృద్ధి

గోడల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్న వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి బాబురావు

  1. విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా): ఈనాటి లేక దూడలే రేపటి పాడి పశువులు అనే
    నానుడి అందరికీ తెలిసిందే. దూడలను సంరక్షించుకుంటే పాడి వృద్ధి చెందుతుందని ఉంగుటూరు వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి డాక్టర్ మల్లిపూడి చిన బాబురావు తెలిపారు. లేగ దూడల యాజమాన్యంలో తీసుకోవలసిన శరీర పై బుధవారం ఉంగుటూరులో రైతులకు తెలిపారు.పశు పోషణ పై ఆధారపడ్డ ఆర్థికంగా బలోపేతం అవుతాయి. దూడల సంరక్షణ, యాజమాన్య చర్యలలో అలసత్వం వహిస్తే ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. లేగ దూడల పోషణపై దృష్టి సారిస్తే పాడి లాభంగా ఉంటుంది.
    = దూడలు జన్మించిన వెంటనే ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

పశువు చూడి కట్టిన నాటి నుంచి ఈయనే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దూడకు జన్మనిచ్చాక కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. దూడ పుట్టిన వెంటనే ముక్కులోనూ నోటిలోనూ ఉన్న జిగురు పదార్థాన్ని వెంటనే తీసివేయాలి, దూడ శరీరాన్ని తల్లితో నాకించాలి లేకపోతే, శుభ్రమైన బట్టతో తుడవాలి. దూడ బొడ్డు నుంచి రెండు అంగుళాలు పడవు వదిలి దారంతో కట్టి కత్తిరించాలి. ఆపైన టించార్ పూయాలి
లేకపోతే బొడ్డు వాపు వచ్చే ప్రమాదం ఉంది. దూడ పుట్టిన వెంటనే అర్థగంటలోపు జున్నుపాలు తాగించాలి. ఈ పాలు దూడల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయి దూడలు ఆరోగ్యంగా ఉంటాయి. పుట్టిన పదవ రోజున నుంచి ప్రతి నెలకొకసారి క్రమం తప్పకుండా సంవత్సరం వరకు నట్టల నివారణ మందు తాగించాలి.పుట్టిన దగ్గరనుంచి మూడు నెలల వరకు దూడలకు సరిపడా పాలు వదలాలి దూడకు 25 రోజునుంచే దాణా ను అలవాటు చేయాలి. మూడు నెలల తర్వాత నుంచి పచ్చిమేతను కూడా అలవాటు చేయాలి
తద్వారా దూడకు పోషకాలు సమకూరుతాయి.

=దూడలకు సోకే వ్యాధులు,నివారణ:
దూడలకు వచ్చే వ్యాధులు పట్ల అవగాహన కలిగి ఉండి వాటి నివారణకు చర్యలు తీసుకుంటే దూడలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటికి సోకే వ్యాధులు పరిశీలిస్తే…

=ధనుర్వాతం: దూడ శరీర భాగాలు బిగుసుకుపోయి దూడలు చనిపోతాయి. దూడ పుట్టిన తరువాత టిటనస్ ఇంజక్షన్లు, విటమిన్ ఏ ఇంజక్షన్లు తప్పనిసరిగా ఇవ్వాలి. లేకపోతే ధనుర్వాతంతో దూడలు పోతాయి.

=తెల్ల పారుడు వ్యాధి: క్రమం తప్పకుండా ఏలిక పాములు (నట్టలు) మందు దూడకు తాగించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దూడలు తెల్లపారుడి వ్యాధి బారిన పడతాయి. ఈ వ్యాధిని రైతులు పాలు ఎక్కువై పారుతుందని అనుకుంటారు, తెల్లపారుడు నివారణకు ప్రతినెల ఏలికి పాముల నివారణకు నట్టల నివారణ ముందు సంవత్సరం వచ్చేవరకు తాగిస్తే ఈ వ్యాధి సోకదు.

=న్యూమోనియా: ముఖ్యంగా దూడలు నివసించే ప్రదేశంలో గాలి, వెలుతురు, శుభ్రమైన నీరు, శుభ్రత ఉండాలి. లేకపోతే శ్వాసకోస సంబంధిత వ్యాధులు బారిన పడతాయి. సకాలంలో సమస్యను గుర్తించి వైద్యం చేయించాలి, అంతేకాకుండా దూడలను గట్టివేసే ప్రదేశంలో షెడ్లలో గాలి వెలురు వచ్చేలా సుబ్రమణ్యం నీరు అందేలాగా చర్యలు తీసుకోవాలి.

=బాహ్య పరాన్న జీవులు: పేలు, మిన్నల్లులు, గోమార్లు, పిడుదలు, వీటిని బాహ్య పరాన్న జీవులుగా పిలుస్తారు. వీటివల్ల రక్తం పీల్చడం వల్ల దూడలు నిరసించిపోతాయి. వీటి నివారణకు దూడ వెంట్రుకలను కత్తిరించాలి. మలధియన్ ద్రావణాన్ని దూడ శరీరంపై పూస్తే పరాన్న జీవులు నశిస్తాయి.

=అంతర పరాన్నజీవులు: ఏలిక పాముల వల్ల నీళ్ల విరోచనాలు రక్త విరోచనాలు అవుతాయి. దూడలు నీరసించిపోయే అవకాశం ఉంది. అంతర పరన్న జీవుల నివారణ కొరకు పశువైద్యుల సూచనల మేరకు ప్రతినెల నట్టల మందు అందించాలి.

= దూడల సంరక్షణ అవగాహనతో చేపట్టాలి

మల్లిపూడి చిన బాబురావు, ఉంగుటూరు వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి డాక్టర్.
దూడల సంరక్షణ అవగాహనతో చేపట్టాలి.
శేషం వ్యాధులను గురించి తెలుసుకుని, సంరక్షణ వాటి పోషణ సమర్థముగా చేపట్టాలి. వ్యాధి నిరోధిక టీకాలు సకాలంలో అందిస్తే వ్యాధులు దరి చేరవు. గోడల పోషణలో తీసుకునే జాగ్రత్తతోనే ఆరోగ్యవంతమైన పశువులుగా రూపొందుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img