Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మంత్రి పదవి నుండి జోగి రమేష్ ను బర్తరఫ్ చేయాలి….

విశాలాంధ్ర- ఏలూరు: గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ను మంత్రి పదవి నుండి భర్త చేయాలని టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) డిమాండ్ చేశారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి జోగి రమేష్ టిడిపి అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక పవర్ పేటలోని టిడిపి కార్యాలయం వద్ద బడేటి చంటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జోగి రమేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ
సభ్యసమాజం తలదించుకునేలా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతుంటే సీఎం జగన్ నవ్వుకుంటూ సునకానందం పొందటం సైకో పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. తన అసమర్ధతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులతో సైకో ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి పదజాలంతో దాడి చేయిస్తున్నార న్నారు. మంత్రి మాటలకు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న జగన్ ను చూసి రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని, భవిష్యత్తులో జగన్ ని చెప్పులతో కొట్టి ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. దున్నపోతు మీద వర్షం పడినట్లు జగన్ వ్యవహార శైలి ఉందని, తక్షణం రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని మంత్రి జోగి రమేష్ ను మంత్రి వర్గం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బడేటి చంటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ ఓటమి తద్యమని తేలిపోవడంతో సైకో ముఖ్యమంత్రి సంస్కారహీనులతో మాటలతో దాడి చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి భాష, చేస్తున్న వ్యాఖ్యలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జగన్ ప్రభుత్వానికి పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జీలు, మహిళా నాయకురాళ్లు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img