Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి ఎన్. టి.అర్….

తేదేపా ఎస్.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ…

విశాలాంధ్ర ఏలూరు: తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి.. కీర్తి నందమూరి తారక రామారావు అని టిడిపి ఎస్.సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్.టి రామారావు 101 జయంతి వేడుకలు స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఎన్.టీ.అర్. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్…తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారన్నారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పిన మహనీయుడన్నారు.ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనమందరం ఐకమత్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర ఎస్.సి. సెల్ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ, ఏలూరు పార్లమెంట్ ఎస్.సి. సెల్ అధ్యక్షులు యాళ్ళ సుజీరావు, పలువురు అధ్యక్ష, కార్యదర్శులు, దళిత నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img