రిక్టర్‌స్కేల్‌పై 7.1తీవ్రత నమోదు
ఫిలిప్పీన్స్‌లో భూమి కంపించింది. గురువారం ఉదయం ఆగ్నేయ తీరంలోని పొందగిటాన్‌లో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతగా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడిరచింది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోలాజిక్ సర్వే వెల్లడిరచింది. ఈ భూకంపం 65.6 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇంత భారీగా భూప్రకంపనలు రావడంతో జనం రోడ్లపై పరుగులు తీశారు. సునామీ వచ్చే అవకాశముందని పుకార్లు రావడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా.. సునామీ హెచ్చరికలను పలు ఏజెన్సీలు తోసిపుచ్చాయి. కాగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి వార్తలు వెలువడలేదు.
సునామీ హెచ్చరికలు జారీ : యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్, హవాయి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సునామీ ప్రమాదం లేదని తెలిపింది. ఫిలిప్పీన్స్ సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేసింది.